సినీచరిత్రలో కొందరి నటుల పేర్లు ఎన్నటికి చెరగని ముద్రగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆ జాబితాకు చెందిన తెలుగు నటులలో, తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పెరఫార్మర్స్ లో కైకాల సత్యనారాయణ ఒకరు. తాజాగా హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరై నటుడు కైకాల సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. చిరంజీవినే సత్యనారాయణ ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపాదంతో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో సత్యనారాయణసి చేత కేక్ కట్ చేయించారు.
అనంతరం ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మాములు మనిషిగా మారాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించి.. కైకాల వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. చిరంజీవి చూపిన చొరవకు కైకాల సత్యనారాయణ, ఆయన కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పుట్టిన రోజున చిరంజీవి ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నిర్మాత కైకాల నాగేశ్వరరావు. చిరు రాక తమకు ఎంతో భరోసాను ఇచ్చిందన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవికి, కైకాల సత్యనారాయణకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎవ్వరూ వెళ్లనిది ఇప్పుడు స్వయంగా చిరంజీవి కైకాల సత్యనారాయణ దగ్గరికి వెళ్లి, ఆయన చేత కట్ చేయించడానికి గల కారణమేంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్. చిరు, సత్యనారాయణ కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వెండి తెరపైన అద్భుతాలు సృష్టించిన కాంబో ఇది.
యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బావగారు బాగున్నారా లాంటి ఎన్నో సినిమాలు.. వీరి ఖాతాలో చెరగని చిత్రాలుగా నిలిచాయి. అయితే.. కైకాల సత్యనారాయణ అంటే కేవలం పాపులర్ యాక్టర్ మాత్రమే కాదు. నవరస నటసార్వభౌముడిగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఈ తరం ప్రేక్షకులను ఆయన గురించిన గొప్పదనం, ఆయన స్టార్డమ్, నటుడిగా ఆయన అందుకున్న హైట్స్.. ఆయన విలువ ఇవేవి తెలియవు. సీనియర్ నటుడిగా కైకాల గారి గొప్పదనాన్ని మరోసారి చాటిచెప్పడానికే, ఆయన విలువను తెలియజేయడానికి మెగాస్టార్ స్వయంగా కదిలి ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది.
సీనియర్ నటులను, ముఖ్యంగా కైకాల లాంటి గొప్ప నటులను మర్చిపోకూడదని, వారి వల్లే ఈరోజున స్టార్స్ గా వెలుగుతున్న వారు యాక్టింగ్ నేర్చుకున్నారని, తన అభిమానాన్ని చూపేందుకే చిరు కైకాల దగ్గరికి వెళ్లారు. చిరుకి కైకాల మీద, ఆయనకు ఈయన మీద ఉన్న ఆదరాభిమానాలు వేరు. అందుకే వెళ్లి ఆత్మీయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలిపారని సమాచారం. ఇక కైకాల పుట్టిన రోజు వేడుకల్లో ఆయన కుమారులు లక్ష్మీనారాయణ, రామారావులు పాల్గొన్నారు. మరి కైకాల పుట్టినరోజున చిరంజీవి రాకపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.