సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జైభీమ్. వాస్తవిక కథ ఆధారంగా తెరెక్కిన ఈ సినిమాను స్వయంగా సూర్యనే నిర్మించారు. ఇటీవల అమజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం మెప్పు పొందుతోంది. అయితే 1992 కాలంలో దళిత, ట్రైబల్ అమాయక ప్రజలను చేయని నేరాలకు బాధ్యులుగా చేసి పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారు. ఇదే క్రమంలో లాయర్ చంద్రు ఆధ్వర్యంలో ఈ కేసు నుంచి అమాయకులైన బాధితుల తరుపున పోరాడి వారికి న్యాయం చేస్తాడు. ఇదే ఈ సినిమా యొక్క తాత్పర్యం.
అయితే ఈ సినిమాలో టీచర్ మిత్ర పేదల గుడిసెలకు వచ్చి చదువులు చెబుతూ వారికి అండగా ఉంటుంది. ఇక నిజజీవితంలో ఎన్. కన్నమ్మాళ్ రియల్ స్టోరీనే సినిమాలో మిత్ర అనే పాత్రతో తీర్చుదిద్దారు. అయితే ఈ ఎన్. కన్నమ్మాళ్ అప్పట్లో ట్రైబల్ ప్రాంతాలకు వెళ్లి వారు నిరక్ష్యరాసులు కావటంతో వారికి అన్నివిషయాల్లో చేదోడు వాదుడోగా నిలబడింది. అసలు ఈ ఎన్. కన్నమ్మాళ్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్. కన్నమ్మాళ్ ది తమిళనాడులోని పుదుకొట్టై జిల్లావాసి. డిగ్రీలో సైన్స్ చదివింది. ఆ తర్వాత ఎల్ఐసీ ఉద్యోగంలో చేరింది. ఎల్ఐసీ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు సొంత జిల్లాలో లిటరసీ పర్సెంట్చూసి ఆమెకు బాధగా అనిపించింది. దీంతో చదువురాని వాళ్లకు చదువు చెప్పించటం, సైకిల్స్ తొక్కటం నేర్పటం వంటి వాటిని ఎన్. కన్నమ్మాళ్ ఓ ఉద్యమంగా భావించింది. 8 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు అక్షరం ముక్క రాని అభాగ్యులకు తనే స్వయంగా గుడిసెల్లోకి వెళ్లి చదువు చెప్పింది. ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తూనే ఉదయం, రాత్రిపూటల్లో జిల్లాలోని గిరిజన, ఇతర కమ్యూనిటీలు ఉన్న ఊళ్లకు వెళ్లేది. ఇక దీంతో పాటు అప్పట్లో అమాయకులైన దళిత, గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై పోరాడి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది ఎన్. కన్నమ్మాళ్.