ప్రస్తుతం దేశంలో ది కేరళ స్టోరీస్ సినిమా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కాకూడదు అంటూ కోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ, ఆ చిత్రం విడుదలైంది. అయితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాలతో కొనసాగింది. లవ్ జిహాద్ స్టోరీ లైన్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. 32 వేల మంది యువతుల కథ ఇది అంటూ ముందు చెప్పగా.. ఆ తర్వాత దానిని ముగ్గురు అమ్మాయిల కథ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాని తాము ఆపలేమన్నారు. ప్రజలే ఆ సినిమాపై తీర్పునిస్తారంటూ వ్యాఖ్యానించింది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? అంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఈ సినిమా తొలిరోజు ఎంత కలెక్ట్ చేసింది? ప్రజల నుంచి ఈ సినిమాకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం.
ది కేరళ స్టోరీ అనేది యదార్థ జీవితాల ఆధారంగా తీసిన కథ అంటూ దర్శకుడు సుదీప్తోసేన్ చెప్పుకొచ్చాడు. తాని ఈ సినిమా కథ కోసం దాదాపు రెండేళ్ల పాటు కష్టపడినట్లు తెలియజేశారు. లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడం వారిని ఐసిఐసిలో చేర్పించడం అనే అంశాలపై ఈ సినిమా ఉంటుంది. మూవీ సంగతి పక్కన పెడితే నటిగా అదా శర్మకు మంచి మార్కులు వచ్చాయి. ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు ఈ సినిమా బాగుందని చెబుతుండగా.. కొందరు మాత్రం ఇది టార్గెటెడ్ మూవీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే కాస్త షాకింగ్ గానే అనిపించవచ్చు. ఎందుకంటే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డే దాదాపు రూ.8 కోట్లు కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇంకొందరు ఆ అంకె మరింత ఎక్కువగా ఉండచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి కశ్మీర్ ఫైల్స్ తో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద నంబర్. ఎందుకంటే కశ్మీర్ ఫైల్స్ చిత్రం తొలిరోజు కేవలం రూ.3.3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ, తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ది కేరళ స్టోరీ చిత్రం తొలిరోజే రూ.8 కోట్లు కలెక్ట్ చేస్తే.. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ది కేరళ స్టోరీ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.