‘ది కశ్మీర్ ఫైల్స్’ దేశంలో ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు, సంచలనాలు సృష్టిస్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. థియేటర్లన్ని హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా చూడ్డానికి ఏకంగా ప్రభుత్వమే హాఫ్‌డే లీవ్ ఇస్తుంది. 1990లో కశ్మీర్‌లో జరిగిన ఊచకోత ఆధారంగా సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. నేటితో ఈ చిత్రం వందకోట్ల రూపాయల క్లబ్‌లో చేరనుంది.
ఇది కూడా చదవండి: OTTలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అయితే కొందరు సినిమాపై విమర్శలు చేయడమే కాక.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని బెదిరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరి భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్‌లతో భద్రత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: కశ్మీర్ ఫైల్స్ పేరిట వాట్సాప్‌లో మోసాలు.. క్లిక్ చేస్తే అంతే..
కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించాయి. బిహార్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్చి 25వ తేదీన ఈ సినిమాను ఉచితంగా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ సినిమాను వీలైనంత మంది చూడాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తార్‌కిషోర్ ప్రసాద్ తెలిపారు. సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషిలు నటించారు. వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరి భద్రత కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ట్రెండింగ్ అవుతున్న కశ్మీర్ పండిట్స్ ఎవరు? ఏంటి వీరి కథ?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.