కేజీఎఫ్, కేజీఎఫ్ 2.. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలు హింసాత్మక నేపథ్యం కలిగిన కథలే. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో ఉంది. అయితే ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రభాస్ ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా నటన రాదంటూ కామెంట్స్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ దూసుకుపోతున్నారు. అభిమానుల కోసం ఖాళీ లేకుండా బిజీబిజీగా సినిమాలు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలిసిందే. ప్రాజెక్ట్ కే, సలార్, మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. సలార్ టీజర్ కూడా విడుదలైంది. టీజర్ లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. టీజర్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం కేజీఎఫ్ 2 కంటే సలార్ అంత గొప్పగా లేదని అంటున్నారు. ఇలా సలార్ సినిమా విషయంలో సోషల్ మీడియా పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ తో పోటెత్తుతుంటే.. బాలీవుడ్ దర్శకుడు సలార్ సినిమాని ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, ది కశ్మీరీ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సలార్ సినిమా మీద, ప్రభాస్ మీద ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ‘తీవ్రమైన హింసను సినిమాల్లో చూపించడం కూడా ఇప్పుడు టాలెంట్ అయిపోయింది. నాన్సెన్స్ సినిమాని ప్రమోట్ చేయడం పెద్ద టాలెంట్ అయిపోయింది. నటుడు కానటువంటి వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ గా ప్రమోట్ చేయడం అతిపెద్ద టాలెంట్ గా పరిగణించబడుతుంది. మరియు ప్రేక్షకులు మూగవారిగా ఉండడం కూడా మదర్ ఆఫ్ ఆల్ టాలెంట్’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు పుట్టుకతోనే ఎవరూ హింసాత్మక ధోరణితో పుట్టరని.. శాంతి కోసం ఎవరైతే యువ మెదడులను ప్రభావితం చేస్తారో ఆ పరిశ్రమ నాయకులే ప్రసిద్ధ సాహిత్యం, సినిమాలు, రాజకీయాల్లో హింసను గ్లామరైజ్ చేస్తూ మీ పిల్లల మెదడులను నియంత్రిస్తారని అన్నారు.
అలాంటి హింసాత్మక ప్రపంచానికి పరిష్కారం కేవలం సృజనాత్మక స్పృహ అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సలార్ సినిమాని, ప్రభాస్ ని ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సలార్ సినిమా టీజర్ విడుదలైన రోజునే వివేక్ అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన వ్యాఖ్యలు ప్రభాస్ ని, సినిమా టీజర్ ని ఉద్దేశించి చేసినవే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సలార్ సినిమా హింసాత్మక నేపథ్యంలో తెరకెక్కింది కాబట్టి కామెంట్స్ చేసినా పర్లేదు కానీ.. ప్రభాస్ కి నటన రాదని అనడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వివేక్ అగ్నిహోత్రి ఫ్యాన్స్ మాత్రం.. హీరోయిజం అంటే రియల్ లైఫ్ లో అందరూ ఆచరించగలిగేలా ఉండాలని.. సమాజాన్ని హింస వైపు ప్రేరేపించే సినిమాలు చేయకూడదని.. అలాంటి వారు హీరోలు కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Now glamourising extreme violence in cinema is also considered talent. Promoting nonsense cinema is considered a bigger talent. Promoting a non-actor as biggest star is considered biggest talent. And assuming audience is super-dumb is mother of all talent. https://t.co/hTJnLjJGYb
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 6, 2023
GM.
People aren’t born violent. Your children’s minds are conditioned by glamourising violence in popular literature, cinema and politics by industry leaders who should be actually inspiring young minds for peace.
In such a violent world only solution is #CreativeConsciousness.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 6, 2023