భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి కూడా ఒకరు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక వివాదాస్పదమైన పాయింట్ తో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ భారతదేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2.. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలు హింసాత్మక నేపథ్యం కలిగిన కథలే. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో ఉంది. అయితే ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రభాస్ ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా నటన రాదంటూ కామెంట్స్ చేశారు.
కశ్మీర్ ఫైల్స్ దర్శకనిర్మాతలను ఆస్కార్, భాస్కర్ అంటూ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో చర్చలకు దారితీశాయో తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అవుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
సంచలనాత్మక మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య, నటి పల్లవి జోషికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ‘ది వ్యాక్సిన్ వార్‘ షూటింగ్ లో ఆమె గాయపడ్డారు. ఈ సినిమాకు సంబంధించి ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. వాహనం అదుపు తప్పి.. ఆమెను ఢీకొంది. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఆమెను ఆసుప్రతికి తరలించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల […]
ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘RC15’ అని వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. పొలిటికల్ యాక్షన్ జానర్ లో సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని ఓకే చేసి సర్ప్రైజ్ చేశాడు చరణ్. తన […]
Prakash Raj: ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదే విషయంపై ఎలాంటి చర్చ లేకుండా […]
కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎన్నో సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ అలా వచ్చిన సినిమాల్లోనే కొన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం. 90లలో కశ్మీర్ పండిట్స్ లైఫ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. […]
‘ది కశ్మీర్ ఫైల్స్’ దేశంలో ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు, సంచలనాలు సృష్టిస్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. థియేటర్లన్ని హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా చూడ్డానికి ఏకంగా ప్రభుత్వమే హాఫ్‌డే లీవ్ ఇస్తుంది. 1990లో కశ్మీర్‌లో జరిగిన ఊచకోత ఆధారంగా […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటారు. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులపై తనదైన స్టైల్లో ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా రాంగోపాల్ వర్మ ప్రముఖ బాలీవుడ్ దర్శకులు వివేక్ రంజన్ అగ్నిహోత్రి పై తనదైన స్టైల్లో ప్రశసంలు కురిపించారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఇది […]