సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలిసిందే. వాయిస్, వీడియో కాల్స్, మెసేజెస్, గ్రూప్ మీటింగ్స్ కోసం ఈ యాప్ ని వాడుతుంటారు. అయితే మొదటి నుంచి వాట్సాప్ లో సెక్యూరిటీ ఉండదు అంటూ అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వాట్సాప్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో యూజర్ల ముందుకు రాబోతోంది.
వాట్సాప్ అనే సోషల్ మెసేజింగ్ యాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజెస్ కోసం ఈ యాప్ ని వాడుతుంటారు. బిజినెస్, ఆఫీసెస్ కూడా కమ్యూనికేషన్, గ్రూప్ చాట్, ఇంటరాక్షన్ కోసం ఈ మెసేజింగ్ యాప్ నే వాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఈ వాట్సాప్ వాడుతున్నారు. అయితే ఈ యాప్ విషయంలో ఎప్పుడూ ఒక ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. అదేంటంటే.. యూజర్ డేటా సేఫేనా? ఈ విషయంలో ఎప్పుడూ ఆ సంస్థ యూజర్లకు భరోసాని ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ సెక్యూరిటీకి సంబంధించి మరిన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చారు.
టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో మీ డేటాను చోరీ చేయడం చాలా చిన్న విషయం అనే చెప్పాలి. అందుకే ప్రతి ఒక్కరు తాము వాడే యాప్స్, ఫోన్స్ అన్నీ సెక్యూర్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఐఫోన్లు కూడా హాకవుతున్నాయి అంటూ వస్తున్న వార్తలు యూజర్లను మరింత భయపెడుతున్నాయి. అయితే వాట్సాప్ తమ యూజర్లకు భరోసానిచ్చేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ ని తీసుకురాబోతోంది. వాట్సాప్ సేఫ్టీ, చాట్ సేఫ్టీ, మాల్ వేర్ ప్రొటెక్షన్ కి సంబంధించిన మూడు ఫీచర్స్ ని వాట్సాప్ తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఈ ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్స్ లో యాంటీ క్లోనింగ్ ఫీచర్ ఒకటి. అంటే మీ వాట్సాప్ ని వేరే కొత్త డివైజ్ లో లాగిన్ చేయడం సులువు కాదు. మీరు మీ పాత ఫోన్ లో ఇందుకు సంబంధించి వెరిఫై చేసి డబుల్ చెక్ చేయాలి. దీని ద్వారా స్కామర్స్ మీ వాట్సాప్ ని క్లోన్ చేసేందుకు వీలు ఉండదు. రెండోది మీ చాటింగ్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ చెక్ చేసుకోవడం. మీరు మీ ఫ్రెండ్, ఫ్యామిలీ ఇలా ఎవరితో చాట్ చేసినా అది ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడో కాదో.. 60 డిజిట్ కోడ్ ద్వార్ చెక్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా పర్సన్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. మూడోది సేఫ్టీ ఫీచర్ డివైజ్ వెరిఫికేషన్. ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. వాట్సాప్ సంస్థ ఆటోమేటిక్ గా దీనిని ఎక్జిక్యూట్ చేస్తుంటుంది. దీని ద్వారా మాల్ వేర్ నుంచి మీ డివైజ్ ని సెక్యూర్ చేస్తారు. ఈ ఫీచర్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ ద్వారా మీ డేటా నిజంగానే సేఫేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.