టాలీవుడ్‌లో బాగా ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో మంచి జోష్ మీదున్నాడు. భీమ్లానాయక్ మూవీతో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భీమ్లానాయక్ నుంచి విడుదలైన రెండు పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా తమన్ స్పందించాడు.
ఇదీ చదవండి: సౌత్ కొరియాలో రియల్ లైఫ్ ‘స్క్విడ్ గేమ్’..!
సెట్స్‌లో మహేష్‌తో దిగిన ఒక ఫొటోని తమన్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమా సాంగ్స్ కంపోజీషన్ పూర్తయ్యింది అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఆ ఫొటోలో మహేష్ లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు ఇంకా అందంగా అవుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.