తళపతి విజయ్ గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తళపతి విజయ్ సినిమాకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బీస్ట్ సినిమా బృందానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. తమ దేశంలో బీస్ట్ సినిమాని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని యూఏఈ దేశాలు అందుకు అనుమతించినా.. కువైట్ మాత్రం నిరాకరిచింది. అయితే ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో చూద్దాం.
ఇదీ చదవండి: MLA బాలకృష్ణకు ఏపీ ప్రభుత్వం షాక్! డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు!
బీస్ట్ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా హైప్ బాగా పెరిగింది. ఆ ట్రైలర్ కథ ఎలా ఉండబోతోంది ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆ కథ వల్లే కువైట్ ప్రభుత్వం బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. బీస్ట్ సినిమాలో మాల్ ను హైజాక్ చేసిన ఉగ్రవాదులకు గల్ఫ్ దేశాలతో సంబంధం ఉంటుంది అనేలా చూపించారు. అసలు ముస్లిం టెరరిజాన్ని గల్ఫ్ దేశాలు సమర్థించవు. గతంలో దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ చిత్రాన్ని కూడా కువైట్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.ఉగ్రవాదులకు గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఉంటాయని, వారు తలదాచుకునేందుకు అక్కడ చట్టాలు కూడా సహకరిస్తాయని మొదటి నుంచి అపవాదు ఉన్న మాట వాస్తవమే. కానీ, అలాంటివి చిత్రాల్లో చూపిస్తే మాత్రం వాళ్లు వాటిని ఆమోదించరని మరోసారి రుజువైంది. విజయ్ సినిమా ఏదైనా సునాయాసంగా 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ, కువైట్ నిర్ణయంతో అక్కడున్న తళపతి విజయ్ ఫ్యాన్స్ కే కాదు.. బీస్ట్ సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం చూపనుంది. అంతేకాదు ఏప్రిల్ 14న కేజీఎఫ్-2 రిలీజ్ కూడా ఉంది. ఆ సినిమా కూడా దేశవ్యాప్తంగా బీస్ట్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై సినిమా బృందం ఇంకా స్పందించలేదు. బీస్ట్ సినిమా ఎలా ఉండోబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Beast is banned by the Ministry of Information in #Kuwait
Reason could be Portrayal of Pak, Terrorists or Violence
Recently Indian Movies #Kurup and #FIR were banned in #Kuwait
Of late, #Kuwait Censor is becoming very strict in GCC compared to other countries in the region
— Ramesh Bala (@rameshlaus) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.