ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. దక్షిణాదిలో ఆయన సినిమా నాలుగు భాషల్లోకి డబ్ అయి రిలీజ్ అవుతుంటాయి. ఇక, తమిళనాట అయితే.. ఫెయిల్ అయిన సినిమాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘మాస్టర్’ అనే సినిమా వచ్చింది. మాస్టర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావటంతో అభిమానులు ‘లియో’ రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా శరా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత విజయ్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనున్నారు. ఆగస్టులో మరో సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఇంకా టైటిల్, ఇతర విషయాలు కూడా బయటకు రాని ఈ సినిమా గురించి ఓ వార్త మీడియా సర్కిళ్లు తెగ చక్కర్లు కొడుతోంది. విజయ్ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఆ వార్త సామాన్య ప్రజల మతులుపోగొడుతోంది.
ఇంతకీ సంగతేంటంటే.. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కాబోయే సినిమా కోసం విజయ్ 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ వార్తలే గనుక నిజమే అయితే.. దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా విజయ్.. ఖాన్‌లను సైతం వెనక్కు నెట్టేస్తారు. హాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా విజయ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అవుతుంది. మరి, విజయ్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం రూ.200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.