మాస్టర్’ తర్వాత దళపతి విజయ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రోజు రోజుకీ సౌత్ సినిమా లెక్కలు మారుతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కథ అయినా భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్ మీద చెప్పి ప్రేక్షకాభిమానులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ‘మాస్టర్’ తర్వాత దళపతి విజయ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ దగ్గరి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ ఈ పేర్లతో క్రియేట్ చేసిన క్యారెక్టర్లతో, ఒక్కో కథలో ఒక్కో కీలకమైన అంశంతో ఆయా పాత్రలకు ముడిపెడుతూ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ని ఏర్పాటు చేసి సరికొత్త ట్రెండ్‌కి తెర తీశాడు లోకేష్. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత ఆయన పూర్తిస్థాయి విలన్‌గా చేస్తున్నారు. శనివారం (జూలై 29) సంజూ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఆయన రోల్‌కి సంబంధించిన గ్లింప్స్ వదిలారు. వీడియో సింప్లీ సూపర్బ్‌గా అనిపించడంతో పాటు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాక్సులు బద్దలయ్యేలా, గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక సంజూ లుక్, మేనరిజమ్స్, స్టైల్ అయితే అదిరిపోయాయి.
గద్దని చూపిస్తూ తన క్యారెక్టర్‌ని రివీల్ చేసిన విధానం హైలెట్ అసలు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా జస్ట్ షాట్స్‌తోనే హైప్ ఎక్కించారు. ఇందులో ‘ఆంటోని దాస్’ పాత్రలో కనిపించనున్నారాయన. ఇక ఈ ఫిలిం టైటిల్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత లోకేష్-చరణ్ కలిసున్న పిక్స్ కూడా ఈ న్యూస్ నిజమనుకునేలా చేశాయి.
కట్ చేస్తే ‘లియో’ లో చెర్రీ కనిపించబోతున్నాడనే దానికి మేకర్స్ హింట్ ఇచ్చారంటూ మరో కొత్త న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ‘లియో’ సంజయ్ దత్ గ్లింప్స్‌లో ‘ఆంటోని’ అనే ఒకే ఒక్క మాట వినిపిస్తుంది. సరిగ్గా గమనిస్తే ఆ వాయిస్ రామ్ చరణ్‌దే అంటున్నారు. నిజంగా గొంతు చరణ్‌లానే అనిపిస్తుంది. తన గత చిత్రాల్లానే చరణ్ క్యారెక్టర్‌ని డైరెక్ట్‌గా మూవీలో రివీల్ చేస్తాడేమో.. చరణ్ మాత్రం కచ్చితంగా కనిపిస్తాడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ గ్లింప్స్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.