టాలీవుడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్ పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. విభిన్నమైన కథలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం, గుఢచారి ఇలా విభిన్నమైన కథలని ఎంచుకుంటూ.. ప్రత్యేకపంథాలో వెళ్తున్నాడు. తాజాగా అడవి శేష్.. మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్‌తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలై.. పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. మహేష్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమా హిట్ అయిన సందర్భంగా హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్‌ని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఆ వివరాలు..
ఈ క్రమంలో తమ్మారెడ్డి ‘‘ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్ అయిన.. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హీరోలను తెగ పొగుడుతూ.. వారి డబ్బా కొడుతున్నారు.. మా దేవుడు, అది ఇది అంటూ పొగుడుతున్నారు. మరి నువ్వు.. మహేష్ బాబు గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మ్టాలాడలేదు.. సినిమా హిట్ అయ్యిందని పొగరా’’ అంటూ సూటి ప్రశ్న వేశారు. అందుకు అడవి శేష్ స్పందిస్తూ.. ‘‘మహేష్ బాబుకి సినిమా నచ్చితనే ప్రశంసిస్తారు.. సినిమాలో ఆయనకు ఏం నచ్చిందో చెప్పి ప్రత్యేకంగా ప్రశంసిస్తారు. ఇక మేజర్ సినిమా టీజర్‌కు ముందు ఆయనకు సినిమా చూపించాం. మూఈవీ కంప్లీట్ కాగానే.. మహేష్ బాబు సైలెంట్‌గా బయటకు వెళ్లారు. మాకు టెన్షన్. మూవీ నచ్చిందా.. లేదా అర్థం కాలేదు. ఆయన దగ్రకు వెళ్లి చూస్తే.. కంట్లో నుంచి నీరు కారుతుంది. సినిమా ఆయనను అంతలా టచ్ చేసింది. ఆ తర్వాత కంట్రోల్ చేసుకుని 2-3గంటలు మాతో మాట్లాడారు’’ అంటూ పలు ఆకసక్తికర అంశాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Virata Parvam: ‘విరాటపర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలు..!