ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో ఓటీటీ బాట పట్టింది. మామూలుగా నటిస్తే పట్టించుకోవడం లేదని ఏకంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది. వెబ్ సిరీస్ కోసం ఇంతలా రెచ్చిపోయిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుందన్న సామెత చందాన హీరోయిన్లు కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాతబడిపోతుంటారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వాళ్ళు కూడా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. సినిమాల్లో అవకాశాల కోసం శృతిమించిన గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధమవుతారు. అవసరమైతే బోల్డ్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తారు. ఇలాంటి వారిలో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. శ్రీలీల, రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి హీరోలు దూసుకుపోతుండడంతో ఈ హీరోయిన్ హవా తగ్గిపోయింది. దీంతో ఓటీటీకి పరిమితమైంది.
ఓటీటీల్లో సినిమాలు చేసింది కానీ ఆశించినంత సక్సెస్ రాలేదు. దీంతో రూటు మార్చి ఘాటు పెంచేసింది. మామూలుగా ఉంటే లాభం లేదని.. హాట్ వెబ్ సిరీస్ లలో నటించింది. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బోల్డ్ గా నటించింది. ఆ హీరోయిన్ ని అలా చూసే సరికి ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అడల్ట్ వెబ్ సిరీస్ లో నటించింది మా హీరోయినేనా అని షాకైపోయారు. అంతలా బెడ్ సీన్స్ లో నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ప్లాన్ ఏ ప్లాన్ బి వెబ్ సిరీస్ లో కాస్త బోల్డ్ గా కనిపించిన తమన్నా.. ఆ సిరీస్ తో ట్రైలర్ చూపించింది కాబోలు. జీ కర్దా వెబ్ సిరీస్ తో అయితే ఏకంగా సినిమానే చూపించింది. చాలా సినిమాల్లో నటించిన తమన్నా ఈ రేంజ్ లో ఇంత బోల్డ్ గా అయితే ఎప్పుడూ రెచ్చిపోయింది లేదు. ఈ సిరీస్ లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ చూసి జనం మెంటలెక్కిపోతున్నారు.
ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ తో మరోసారి ఉక్కబోత పెట్టించేందుకు సిద్ధమవుతోంది. గతంలో రాధికా ఆప్టే, కియారా అద్వానీ, నేహా ధూపియా వంటి హీరోయిన్స్ నటించిన లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ గా వస్తుంది. ఇందులో కూడా తమన్నా ఓ రేంజ్ లో బోల్డ్ సీన్స్ లో నటించింది. విజయ్ వర్మతో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగులో భోళా శంకర్, తమిళంలో జైలర్, అరణ్మయి 4, మలయాళంలో బాంద్రా సినిమాలు తప్పితే ఇక ఏ సినిమాలూ లేవు. పైగా చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరూ సీనియర్ హీరోలే. కుర్ర హీరోలతో చేసే ఛాన్స్ వస్తుందో లేదో అని ఇలా ఓటీటీ బాట పట్టింది. అయితే నార్మల్ గా ఉంటే పట్టించుకోవడం లేదని బోల్డ్ వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి మరి నటిస్తోంది.