‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లతో మిల్కీబ్యూటీ తమన్నాకి స్టార్ హీరోల పక్కన భారీ కమర్షియల్ హిట్ కొట్టినా రాని క్రేజ్ వచ్చేసింది. నిజానికి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ కంటే తమన్నానే తన పర్ఫార్మెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీసేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈమధ్య మిల్కీబ్యూటీ తమన్నా పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తోంది. అమ్మడి రొమాంటిక్ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడడం, ఇద్దరూ రీసెంట్ ఇంటర్వూల్లో దాదాపు వారి మధ్య రిలేషన్ నిజమేనన్నట్లు మాట్లాడడం తెలిసిందే.
తమన్నా నటించిన హిందీ వెబ్ సిరీస్ జీ కర్దా. ఆమెజాన్ ప్రైమ్ లో ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ హీరోయిన్ ఇందులో కాస్త బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సీన్స్ పై ఈ ముద్దుగా తాజాగా స్పందిస్తూ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇవే కామెంట్స్ ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ జీ కర్దా. ఇది హిందీలో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ గా నటించి గ్లామర్ డోస్ పెంచేసిందని కొందరు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తమన్నా ఈ కామెంట్స్ పై రిప్లయ్ ఇచ్చారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో ఓటీటీ బాట పట్టింది. మామూలుగా నటిస్తే పట్టించుకోవడం లేదని ఏకంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది. వెబ్ సిరీస్ కోసం ఇంతలా రెచ్చిపోయిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?