ఈమధ్య ఎక్కడ చూసినా మిల్కీబ్యూటీ తమన్నా పేరే వినిపిస్తోంది. ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీసుల్లో రెచ్చిపోయి రచ్చ చేసి వార్తల్లో నిలుస్తున్న తమన్నా సంపాదన, ఆస్తుల వివరాలుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
కొత్త హీరోయిన్లు రావడం, పూర్వం పెద్దోళ్లు సామెత చెప్పినట్లు జనాలు ఆ కొత్త అందాలు చూస్తూ మైమరచిపోయి.. ఒకప్పుడు తన అంద చందాలతో అదరహో అనిపించిన మిల్కీబ్యూటీ తమన్నాని బొత్తిగా మర్చిపోయారు. హిందీ, తెలుగు, తమిళంలో నటించి దాదాపు 18 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న తమ్మూ ఎన్ని డక్కా మొక్కీలు తినుంటుంది చెప్పండి.. అందుకే కెరీర్ పరంగా కాస్త వెనుక బడ్డా.. కొత్త నీరు కూడా వస్తుండాలి కాబట్టి పిల్లలకి ఓ ఛాన్స్ ఇచ్చాను అన్నట్లు మౌనంగా ఉండి పోయింది. కట్ చేస్తే, జస్ట్ టైమ్ గ్యాప్ అంతే అనేలా ఇంతకుముందు ఎప్పుడూ చూడని, చూపించని సొగసులను సరికొత్తగా చూపిస్తూ, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా యధేచ్ఛగా వయ్యారాల విందు చేస్తుంది. అసలు లిప్ లాక్ అంటే నో చెప్పి, ఇప్పుడు మూతి ముద్దులివ్వడంలో పీహెచ్‌డీ ఏమైనా చేసిందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది. లవ్, ఎఫైర్స్, పెళ్లి లాంటి న్యూస్ వస్తే నాన్సెన్స్ అని కొట్టి పడేసేది కాస్తా నటుడు విజయ్ వర్మతో పబ్లిక్‌గా చెట్టా పట్టాలు, చేతిలో చేతులేసుకుని తిరిగేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌తో ప్రకంపనలు పుట్టించేసింది. ఏంటి మనం చూస్తుంది తమన్నానేనా? ప్రేక్షకులు కాసేపు తమ కళ్లను తాము నమ్మలేకపోయారంటే నమ్మండి.
‘అవ్వా, అసలా బూతు డైలాగులేంటి, ఆ బోల్డ్ సీన్లేంటి, ఆ రొమాన్స్ ఏంటి?’ అంటూ నోరెళ్లబెట్టారు. బోల్డ్‌గా నటించడం గురించి మీడియా, సోషల్ మీడియాలో నానా హంగామా చేయడంతో, కథలో భాగంగానే అలాంటి సీన్స్ చేశాను తప్ప అందులో తప్పేంటి? అన్నట్లు మాట్లాడింది. ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’ లో రియల్ లైఫ్ ప్రియుడు విజయ్ వర్మతోనూ రెచ్చిపోయి రచ్చ చేసింది. యూత్ అంతా సామాజిక మాధ్యమాలలో వీరిద్దరి మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్లకు సంబంధించిన వీడియో క్లిప్స్, స్క్రీన్ షాట్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ తర్వాత ‘భోళా శంకర్’ మూవీలో ఆడిపాడుతోంది. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే సూపర్‌స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’ సినిమాలోనూ కనిపించనుంది. దిలీప్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 10 ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ లో చేసిన రచ్చ కారణంగా తమన్నాకు మరిన్ని ఓటీటీ ఆఫర్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ వెండితెర మీద కూడా అలాంటి సీన్లలో కనిపిస్తేనా నా సామిరంగా అంటూ కొంటె కోరికలు కోరుతున్నారు కుర్రాళ్లు.
ఈమధ్య ఎక్కడ చూసినా మిల్కీబ్యూటీ పేరే వినిపిస్తోంది. ఇక ఆమె సంపాదన గురించి కూడా ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. తమన్నా నెల, ఏడాది సంపాదనతో పాటు ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. త్వరలో నటిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనున్న తమ్మూకి ఇప్పటికే అక్షరాలా రూ. 150 కోట్ల మేర ఆస్తులున్నాయట. అలాగే పలు వ్యాపారాల్లోనూ భారీగానే పెట్టుబడులు పెట్టిందట. ఒక్కో సినిమా రూ. 5 నుండి 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఇవి కాక ఇతర ప్రైవేట్ ఈవెంట్స్, యాడ్స్ ద్వారా వచ్చే సంపాదన అదనం. ఈ లెక్కన ఏడాదికి అన్నీ కలుపుకుని దాదాపు రూ. 18 కోట్లు, నెలకి రూ. 2 కోట్ల చొప్పున (కాస్త అటు ఇటుగా) సంపాదిస్తుందని తెలుస్తోంది. ఈ వార్తలపై తమన్నా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.