తమన్నా నటించిన హిందీ వెబ్ సిరీస్ జీ కర్దా. ఆమెజాన్ ప్రైమ్ లో ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ హీరోయిన్ ఇందులో కాస్త బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సీన్స్ పై ఈ ముద్దుగా తాజాగా స్పందిస్తూ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇవే కామెంట్స్ ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యకాలంలో కాస్త హద్దులు దాటి బోల్డ్ సీన్స్ లో నటించేస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఈ అమ్మడు తన అందాల ఆరబోతతో కనువిందు చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఇకపోతే, ఈమె నటించిన “జీ కర్దా” హిందీ వెబ్ సిరీస్ ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అరుణిమా శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో తమన్నాతో పాటు సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటీ, అన్య సింగ్, సిమోన్ సింగ్ వంటి నటీ, నటులు నటించారు.
అయితే, ఎన్నో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ల మధ్య సాగే ఈ సిరీస్ లో తమన్నా కాస్త బోల్డ్ గానే నటించింది. కాగా, ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి ఇలా గ్లామర్ పాత్రలో నటించడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. తమన్నా ఇలా రెచ్చిపోయిందేంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వూల్లో పాల్గొన్న తమన్నా.. “జీ కర్దా” వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఈ సిరిస్ లో ఇలా బోల్డ్ గా నటించడం అనేది పాత్ర డిమాండ్ చేసింది. దీని కారణంగానే అలా గ్లామర్ పాత్రలో నటించాల్సి వచ్చిందన్నారు. ఆ సీన్స్ మీకు నచ్చినా నచ్చకపోయిన కథలో భాగంగానే చూడాలంటూ మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె చేసిన ఈ హాట్ కామెంట్స్ కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే, ఇదే కాకుండా తమన్నా నటిస్తున్న మరో వెబ్ సిరీస్.. లస్ట్ స్టోరీస్ 2. ఇందులో కూడా ఈ హీరోయిన్ మరింత హాట్ గానే కనిపించడం విశేషం.