గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మల పేర్లు మార్మోగిపోతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్లిన తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అదే వేడుకలో తమన్నా, విజయ్ వర్మ పబ్లిక్ గా ముద్దాడుకున్నారని ఓ వీడియో, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ బలపడింది. అదీగాక తమన్నా, విజయ్ వర్మ గతంలో కూడా పార్టీలకు, బయటికి కలిసి వెళ్లడం జరిగిందట. వీరికి సంబంధించి పాత ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో తమన్నా, విజయ్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందా? లేక ఫ్రెండ్ షిప్ అంటూ ఇలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్ అయితే లిప్ లాక్స్ ఎందుకు ఇచ్చుకుంటారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని.. వారిమధ్య ఏమి లేదని తమన్నా ఫ్యాన్స్ వాదన. కాగా.. రీసెంట్ గా గోవాలో న్యూ ఇయర్ పార్టీలో తమన్నా, విజయ్ ల సాన్నిహిత్యం, హగ్స్, కిస్సెస్ చూసి.. అసలు ఈ విజయ్ వర్మ ఎవరు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు నెటిజన్స్, సినీ ప్రేక్షకులు. తాజా సమాచారం ప్రకారం, నటుడు విజయ్ వర్మ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి కావడం విశేషం.
మరి తమన్నా ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విజయ్ వర్మ ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. విజయ్ వర్మ నటుడిగా బాలీవుడ్ లో సెటిల్ అయినప్పటికీ, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. ఇక ఇక్కడే థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత పూణేలోని ‘ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో యాక్టింగ్ కోర్స్ లో చేరి.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అలా 2008లో ‘షోర్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ లో అడుగుపెట్టి.. 2012లో చిట్టగాన్ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేశాడు. అలా 2016లో పింక్ సినిమా చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అక్కడి నుండి బాలీవుడ్ లో గల్లీబాయ్, సూపర్ 30, బాఘీ 3, డార్లింగ్స్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
ఇక బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఓ సినిమా చేశాడు విజయ్. నాని హీరోగా నటించిన ‘ఎంసిఎ’ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పటివరకు విజయ్ కి తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. అలా మళ్లీ హిందీలో బిజీ అయిపోయాడు. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ, సడన్ గా తమన్నాతో క్లోజ్ ఫా ఉంటూ, ముద్దాడుతూ కనిపించేసరికి ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఎప్పుడు ప్రేమ, పెళ్లి టాపిక్స్ వచ్చినా.. తమన్నా అవాయిడ్ చేస్తూ వచ్చేది. ఇప్పుడేమో విజయ్ తో చెట్టాపట్టాలేసుకొని కనిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సరే ఏమి లేదని అనుకున్నా.. ఆ విషయాన్నీ వారిద్దరే క్లారిఫై చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా దాదాపు 16 ఏళ్ళు పూర్తిచేసుకున్న తమన్నా.. పెళ్లీడు దాటినప్పటికీ, హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ సరసన తమన్నా సినిమాలు చేసింది. ప్రస్తుతం తమన్నా వయసు 33 ఏళ్ళు. ఇంకా హీరోయిన్ గా సినిమాలు చేస్తోందిగానీ, కొంతకాలంగా సరైన హిట్ రాలేదనే చెప్పాలి. మరోవైపు విజయ్ వర్మ వయసు 36 ఏళ్ళు. సో.. వీరిద్దరి జంట కూడా బాగుందని అంటున్నారు. కానీ, ఇద్దరి మధ్య ఉంది ప్రేమా లేక ఫ్రెండ్ షిప్పా? అనేది క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయం. మరి ట్రెండ్ అవుతున్న తమన్నా, విజయ్ వర్మల జంట గురించి మీరేం అనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.
Shocking 😱😳
Tammy at Private new year party yesterday in Goa with @MrVijayVarma 🔥 @tamannaahspeaks
#TamannaahBhatia #Tamannaah pic.twitter.com/yBjiQL0mrr— ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) January 1, 2023