సినీ ఇండస్ట్రీకి చెందిన అందాల భామలు ఎప్పుడు ఎలాంటి సర్ప్రైజులు ఇస్తారో చెప్పలేం. కానీ వాళ్ళిచ్చే సర్ప్రైజ్ మాత్రం సోషల్ మీడియాను హీటెక్కించే విధంగానే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో హోమ్లీ రోల్స్ చేసినప్పటికీ, ఓ స్థాయికి చేరుకున్నాక మెల్లగా అందాలను ఆరబోయడం, స్కిన్ షో చేయడం మొదలెడతారు. ఇక ఒక్కసారి వారి అందాలకు ఫ్యాన్ క్రేజ్ పెరిగిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు గ్లామర్ షో చేసేందుకు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు.
ఒకవేళ అవకాశం రాలేదంటే స్వయంగా అవకాశాన్ని కల్పించుకుంటారు. ఏ విధంగానో తెలుసా.. ఫోటోషూట్స్ ద్వారా. సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటీ తమన్నా అందం గురించి గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో, సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. యాక్టింగ్ పరంగా పక్కన పెడితే.. తమన్నా అందాలకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. టాప్ టు బాటమ్ అందాలను ఎరగా వేస్తూ కుర్రకారును వలలో వేసుకుంటోంది.
అందుకు తాజాగా షేర్ చేసిన ఫోటోలే నిదర్శనం. రెట్రో పింక్ టాప్.. ఓపెన్ ‘వి నెక్’ షేప్ డ్రెస్ లో తమన్నా అందాలను కెమెరా ముందుంచింది. అంతే ఫ్యాన్స్, కుర్రకారు ఊరుకుంటారా.. అలా తమన్నా అందాలను స్కాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమన్నా స్కిన్ టోన్ కి మెరుస్తున్న పింక్ డ్రెస్ లో లేత గులాబీ బాలలా ఉందంటూ గ్లామర్ ప్రియులు కామెంట్స్ లో పొగడ్తలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి తమన్నా లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.