సాధారణంగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి లేదా టీవీ ఆర్టిస్ట్ లకు సంబంధించి ఏదొక కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది యూట్యూబ్ నటి స్వాతి నాయుడు. తనను ప్రేమ పేరుతో అన్నివిధాలా చమ్మక్ చంద్ర వాడుకున్నాడని స్వాతి నాయుడు చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర నాకు అవకాశం ఇస్తా అన్నాడు. కానీ అప్పుడు జబర్దస్త్ లో అమ్మాయిలకు అవకాశం లేదు.. అబ్బాయిలే అమ్మాయిలా వేషం వేసేవారు. అయితే.. నాకు కాదని మా బ్రదర్ కి అవకాశం ఇవ్వాలని కోరాను. నాతో లవ్వు అదీఇదీ అని కొన్నిరోజులు తిరిగాడు. చివరికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత నేను.. ‘ఆఫర్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని గట్టిగా అడిగాను. అప్పుడు నువ్వు ఏం చేస్తావ్.. అంటూ ర్యాష్ గా మాట్లాడినట్లు స్వాతి నాయుడు చెప్పినట్లు సమాచారం.
నేను జబర్దస్త్ షూట్ చూడటానికి వెళ్ళినప్పుడు చమ్మక్ చంద్ర నాతో మాట్లాడి నా నెంబర్ తీసుకున్నాడు. అప్పటికి నేను బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యి బాధలో ఉన్నాను. తర్వాత చమ్మక్ చంద్ర కాల్ చేసి కారులో తిప్పడం, తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆ టైంలో నువ్వంటే ఇష్టమని చెప్తే నమ్మేశాను. ఇద్దరం అంత క్లోజ్ కాలేదు కానీ మొదట్లోనే పెద్ద వెధవ అని తెలిసిందంటూ స్వాతినాయుడు ఆరోపించింది.
అలా అతని బండారం బయటపెట్టిన తరువాత.. పోలీస్ స్టేషన్లు.. కంప్లైంట్.. చాలా అయ్యాయి. నన్ను చంపడానికి చూశాడు. పోలీసుల దగ్గర కూర్చున్నప్పుడు కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. నేనే అతని వెంటపడ్డానని అన్నారు. కానీ అలాంటివాళ్లు జబర్దస్త్లో చాలామంది ఉన్నారు. అతనొక్కడిపైనే ఎందుకు ఆరోపణ చేస్తాను. ఇలా నాలా మోసపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్లు భయపడి ముందుకు రావడం లేదు. నాకైతే భయం లేదు కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు.
అసలు ముందే నిన్ను వాడుకుని వదిలేస్తా అని చెప్పి ఉంటే.. ఇష్టమైన ఓకే అనేదాన్ని లేదంటే లేదు. కానీ అవకాశం ఇస్తానని చెప్పి వాడుకుని తర్వాత మాట మార్చడం నాకు నచ్చలేదు. దేనికైనా పద్దతి ఉంటుంది. కానీ అతను నువ్ ఏం చేస్తావ్.. ఏం పీకుతావ్ అన్నట్టుగా మాట్లాడాడు. అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే” అంటూ చంద్రపై స్వాతినాయుడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి చంద్రపై స్వాతినాయుడు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.