ప్రముఖ నటి స్వర భాస్కర్ ఇటీవల తన పెళ్లి విషయాన్ని బయటపెట్టిన సంగతి విదితమే. చాన్నాళ్లు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన స్వర.. ఎట్టకేలకు దాన్ని రివీల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్‌తో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను పంచుకుంది.
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి సినీ ప్రియులకు తెలిసిందే. అందం, అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంది. అలాంటి స్వర భాస్కర్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ రాజకీయ నాయకుడు ఫహద్ అమ్మద్తో కలసి సోషల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న స్వర.. పొలిటికల్‌గానూ ఇన్నాళ్లు ఆయతో నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారి.. చివరకు పెళ్లి వరకు చేరుకుంది. ఫహద్ అహ్మద్‌తో రిలేషన్‌ను చాన్నాళ్లు రహస్యంగా ఉంచుతూ వచ్చింది స్వర.
ఇటీవల అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టింది స్వర భాస్కర్. ఇద్దరూ లవ్‌లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆల్రెడీ తమ వివాహం అయిపోయిందని స్వర భాస్కర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రీసెంట్గా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 6న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఓ కోర్టులో అత్యంత సన్నిహితుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు స్వర – అహ్మద్‌లు. తాజాగా తమ ఫస్ట్ నైట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. దీంతో అవి వైరల్ అయ్యాయి. హనీమూన్ బెడ్‌ను తన తల్లి గులాబీలతో అలంకరించిందంటూ ఆ పోస్టును ఫ్యాన్స్‌తో పంచుకుంది. తమ లవ్‌స్టోరీ ఎలా మొదలైందో చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.