విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన డార్క్ యాక్షన్ డ్రామా చిత్రం”విక్రమ్”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. కమల్ హసన్ మళ్లీ నటుడిగా పుట్టించిన సినిమా ‘విక్రమ్’ అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అంటే ఏంటో తెలియని కమల్ కు ఈ సినిమా ద్వారా హిట్ పడింది. కమల్ ని విమర్శించే వాళ్ళు కూడా సినిమాలోని కమల్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. స్టార్ హీరో సూర్య కూడా ఈ సినిమాలో తళుక్కున మెరిశాడు. అయితే ఈ సినిమాలో తాను పోషించిన పాత్రకి ఎంత తీసుకున్నాడనే చర్చ తెరమీదకి వచ్చింది. అయితే సూర్య రెమ్యూనరేషన్ పై తమిళ ఇండస్ర్టీలో అనేక వార్తలు వినిపిస్తోన్నాయి.
విక్రమ్ సినిమాలో నిజానికి సినిమాలో సూర్య ది గెస్ట్ రోల్ కానీ, కథను మలుపు తిప్పే పాత్ర ఈయనదే కావడం గమనార్హం. ఈ సినిమాలో సూర్య కేవలం ఐదు నిమిషాలే నటించినా..ఆ పాత్ర మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంది. సినిమాకు అదే పెద్ద అస్సెట్‌గా నిలిచిందని చాలామంది చెబుతున్నారు. గతంలో వచ్చిన ఖైదీకి లో కూడా సూర్య నటించిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ సినిమాలో తన పాత్ర కోసం ఎంత పుచ్చుకున్నాడనే విషయంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: విరాట పర్వం ట్రైలర్ లాంచ్ వేడుకలో అపశృతి.. తృటిలో తప్పిన ముప్పు!అయితే సూర్య.. విక్రమ్ సినిమాలో నటించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కమల్ సినిమా కావడంతో ఆయనపై ఉన్న అభిమానంతో సూర్య మరో ఆలోచన లేకుండా ఈ సినిమా ఒప్పుకున్నాడంట. షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు తప్పిస్తే ఎక్కడ కూడా రెమ్యూనరేషన్ గురించి సూర్య అడగలేదని టాక్. దీంతో సూర్య అభిమానులు ఆయన పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. మరి.. సూర్యకు సంబంధించి వస్తోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Annan @Suriya_offl – a true fan of @ikamalhaasan sir. He could have easily rejected Rolex character since he is a leading hero.
He did it because kamal sir is the lead and he wanted to contribute . That’s how u repay to the person who Inspired you ! #Vikram
— Prashanth Rangaswamy (@itisprashanth) June 4, 2022
Annan @Suriya_offl – a true fan of @ikamalhaasan sir. He could have easily rejected Rolex character since he is a leading hero.
He did it because kamal sir is the lead and he wanted to contribute . That’s how u repay to the person who Inspired you ! #Vikram
— Prashanth Rangaswamy (@itisprashanth) June 4, 2022