పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించే సినిమాలపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తున్నాడు. ఇక తెలుగులో తమిళ్ హీరో సూర్యకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘కల్కి2898AD’. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన “ఆదిపురుష్” థియేటర్ల వద్ద అంతగా సందడి చేయలేకపోయింది. ఆ సినిమా పై పలు వివాదాలు కూడా వచ్చాయి. అయితే.. ఈ సారి అలా జరగకూడదని ఫ్యాన్స్ కొరుకుంటున్నారు. కానీ.. ముందుగా ‘కల్కి2898AD’నుండి ప్రభాస్ లుక్ విడుదల చేసిన సమయంలో దానిపై ట్రోల్స్ నడిచాయి. అయితే వాటాన్నింటికి చెక్ పెడుతూ.. మేకర్స్ వెంటనే ‘కల్కి2898AD’గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులకు కావాల్సిన అబ్బురపరిచే అన్నీ ఎలిమెంట్స్ ఈ గ్లింప్స్‌లో చూపించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోయారు
“కల్కి” గ్లింప్స్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది కానీ.. ఉహించిన స్థాయిలో వ్యూస్ మాత్రం రాబట్టలేకపోయింది. ‘కల్కి’ గ్లింప్స్ ఇప్పటి వరకు 21 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. చూడటానికి ఇదే చాలా పెద్ద రీచ్ అనిపించినప్పటికీ.. సూర్య మూవీ ‘కంగువా’ గ్లింప్స్ రీచ్ తో పోలిస్తే చాలా తక్కవగా ఉంది. తమిళ స్టార్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో ‘కంగువా’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఎంత సూర్య ఉన్నా.. ప్రభాస్ పాన్ ఇండియా ఫాలోయింగ్ తో పోలిస్తే.. ఈ సినిమా రీచ్ తక్కువ ఉండాలి. కానీ.., ఆశ్చర్యంగా ‘కంగువా’ గ్లింప్స్ 30 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టింది. దీంతో.. కల్కి గ్లింప్స్‌కి కన్నా ‘కంగువా’ గ్లింప్స్‌కి ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు అయ్యింది. ఆ తేడా కూడా సుమారు 9 మిలియన్స్ ఉండటం మరో ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి.. సూర్యకు తెలుగులో మంచి మార్కేట్ ఉంది. తను చేసిన సినిమాలు ఇక్కడ పెద్ద విజయాలు సాధించాయి. అలాగే ‘కంగువా’ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎకంగా 10 భాషల్లో విడుదల కానుంది. ఈ కారణంగానే ‘కంగువా’ పై ఇంతటి క్రేజ్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
ఇక ‘కల్కి2898AD’మూవీ దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో హీరోగా ప్రభాస్, హీరోయిన్‌గా దీపికా పదుకొనే, ప్రధాన పాత్రల్లో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ ,దిశా పటాని చేయబోతున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు. ఇంత మంది భారీ తారణం ఉండటంతో, ఈ సినిమాపై కూడా మరింత హైప్ పెరుగుతూ పోతుంది. “సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్” సినిమాల ఫలితాలతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ‘కల్కి’ ఒక బూస్టర్ డోస్‌ని ఇచ్చినట్టయ్యింది. డార్లింగ్ ఖాతాలో హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. ఎటొచ్చి.. కంగువా’ రీచ్ తమ హీరో సినిమాని డామినేట్ చేయడమే ప్రభాస్ ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. మరి.. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.