చిన్న సినిమాగా విడుదలై కన్నడ సినిమా స్థాయిని పెంచింది 'కాంతార'. స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడీ మూవీకి కొనసాగింపుగా 'కాంతార 2' రాబోతుంది. ఈ నేపథ్యంలో కాంతార 2కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
గతేడాది చిన్న సినిమాగా విడుదలై కన్నడ సినిమా స్థాయిని పెంచింది ‘కాంతార’. స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ముందుగా కన్నడ వరకే రిలీజ్ అయినప్పటికీ.. మొదటి షో నుండే సూపర్ సక్సెస్ అయ్యేసరికి.. సినిమాని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ చేశారు. ఇంకేముంది.. ఇక్కడ సేమ్ బ్లాక్ బస్టర్ సౌండ్. అలా అన్ని భాషల్లోను సక్సెస్ అందుకొని.. వరల్డ్ వైడ్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది కాంతార. ప్రముఖ హోంబలే ఫిలిమ్స్ వారు కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించగా.. ఏకంగా రూ. 400 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
దీంతో సినిమా గురించి దేశమంతా ఎంతో గొప్పగా మాట్లాడుకుంది. ముఖ్యంగా రిషబ్ శెట్టికి పాన్ ఇండియా క్రేజ్ తో పాటు ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కాయి. కాగా.. ఇప్పుడీ మూవీకి కొనసాగింపుగా ‘కాంతార 2’ రాబోతుంది. అయితే.. దర్శకుడు రిషబ్ శెట్టి.. పార్ట్ 2ని సీక్వెల్ లా కాకుండా ప్రీక్వెల్ అని ప్రకటించాడు. అదీగాక కాంతార 2లో.. అసలు భూతకోల సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని, కాంతారలో మిస్ అయిన హీరో తండ్రి ఏమైపోయాడు? అనే అంశాలను చూపించనున్నారట. పైగా కాంతార 2ని అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు మినిమమ్ సెట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో కాంతార 2కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాంతార 2లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోతున్నారని టాక్. మరి ఈ వార్త నిజమేనా? అంటే.. అవునని అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే.. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రిషబ్ శెట్టిని.. కాంతార ప్రీక్వెల్ లో రజినీ పేరు వినిపిస్తుంది.. నిజంగా ఆయన నటించనున్నారా? అని అడగ్గా.. అక్కడినుండి మౌనంగా వెళ్ళిపోయాడట రిషబ్. దీంతో అది రూమర్ అయితే రియాక్ట్ అయ్యేవాడు.. నిజం కాబట్టి ఏమి చెప్పకుండా వెళ్లిపోయాడని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. అప్పటినుండి కాంతార 2లో సూపర్ స్టార్ అంటూ నెట్టింట హంగామా చేస్తున్నారు. కాగా.. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా.. ఒకవేళ నిజమైతే, రజినీ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తాడోనని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అదీగాక కాంతార చూసి చాలా ఇంప్రెస్ అయిన రజిని.. పలుమార్లు రిషబ్ ని ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించడం, గిఫ్టులు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కన.. కాంతార 2లో రజిని కనిపించినా ఆశ్చర్యపోయే అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు. మరి కాంతార 2పై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Superstar @rajinikanth greeting
Rishab Shetty for the monumental success of #kantara https://t.co/EhcGmUfW7N#RishabShetty #Rajinikanth #KantaraTheLegend #KantaraMovie pic.twitter.com/MAbPDLyloK— Boldsky (@Boldsky) October 29, 2022