బుల్లితెరలో ప్రస్తుతం సీరియల్స్ కన్నా.. ప్రత్యేక షోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకేనేమో చాలా ఛానల్స్ సీరియల్స్ కంటే బుల్లితెర సెలబ్రటీలను ఒక్కచోట చేర్చి టీవీ షోలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా షోలు హిట్టవ్వగా.. కొత్తగా మొదలవుతున్న షోలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ షోలలో ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ‘సూపర్ క్వీన్స్’ షో సెమీ ఫైనల్ కు చేరుకుంది. అందులో నిర్వాహకులు ఒక టాస్కు ఇచ్చారు. కంటెస్టెంట్లు వారి మోచేతిలో కూల్ డ్రింక్ టిన్స్ ను పగలగొట్టాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: తెరమీదకు RRR 2.. జక్కన్న మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా..?
ఆ టాస్కులో కంటెస్టెంట్లు గాయపడినట్లుగా తెలుస్తోంది. మోచేతితో టిన్స్ ను పగలగొట్టే క్రమంలో నవ్య స్వామి, భాను చేతులకు గాయాలు అయినట్లు ప్రోమోలో కనిపించింది. వారి మోచేతి నుంచి, వేళ్ల నుంచి రక్తం కారినట్లుగా చూపించారు. అయితే నిజంగానే గాయాలు అయ్యాయా? లేక అందులోకూడా ఏదైనా టీఆర్పీ ట్రిక్ ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.