తెలుగు రాష్ట్రాలలో సీరియల్స్ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఏళ్ళు గడిచినా.. ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీలో ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. సీరియల్స్ కి ఉండే ఆదరణ ఎప్పుడూ తగ్గదు. ఈ మధ్యకాలంలో అంతటి ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. ఈ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ అందరికీ బాగా సుపరిచితం.
బుల్లితెరపై సీరియల్స్ చూసి వినోదాన్ని పొందుతున్న ఆడవాళ్లు కోట్లలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాలలో సీరియల్స్ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఏళ్ళు గడిచినా.. ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీలో ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. సీరియల్స్ కి ఉండే ఆదరణ ఎప్పుడూ తగ్గదు. ఈ విషయాన్నీ దశాబ్దాలుగా ప్రూవ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే.. సీరియల్స్ అన్నాక కొన్ని ఫేవరేట్స్ ఉంటాయి. ఒక్కసారి కనెక్ట్ అయితే వాటిని చివరిదాకా ఆదరిస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో అంతటి ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ గురించి తెలియని వారుండరు.
ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్స్ తో పాటు మోనిత క్యారెక్టర్ అందరికీ బాగా సుపరిచితం. విలన్ క్యారెక్టర్ అని.. ఆ క్యారెక్టర్ బిహేవియర్ ని బట్టి.. మొదట్లో తిట్టుకున్నా, కొన్నాళ్ల తర్వాత మోనిత కనిపించకపోతే సీరియలే బోర్ కొట్టేంత క్రేజ్ వచ్చిందంటే మాటలు కాదు. ఇంతకీ సీరియల్ లో మోనితగా నటించింది ఎవరో తెలుసు కదా! శోభా శెట్టి. కర్ణాటకకు చెందిన ఈ భామ.. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగువారికి బాగా దగ్గరైంది. ఓ రకంగా ఇంట్లో వ్యక్తిలా మారిపోయిందంటే నమ్మొచ్చు. పైగా సీరియల్స్ లో ఇంత అందమైన గ్లామరస్ బ్యూటీ.. విలన్ గా ఉండటం.. మేల్ ఆడియెన్స్ లో ఇంటరెస్ట్ క్రియేట్ చేసే విషయం.
ఓవైపు సీరియల్ చేస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శోభా.. కార్తీకదీపం సీరియల్ ముగినప్పటి నుండి మరే సీరియల్ లోను, షోలోనూ కనిపించడం లేదు. అందరూ శోభాని ఏదొక విధంగా టీవీలో చూడాలని ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో శోభాకి సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే.. శోభాకి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈసారి ఎలాంటి క్యారెక్టరో తెలుసా.. రిషికి పెద్దమ్మగా అంట. ఏంటి.. ఇంత గ్లామరస్ బ్యూటీని హీరోకి పెద్దమ్మ క్యారెక్టర్ లో చూపిస్తారా? అని మీకు ఆవేశం రావచ్చు. కానీ.. ప్రస్తుతానికి ఇది టాక్ మాత్రమే. నిజాలేంటి శోభా, గుప్పెడంత సీరియల్ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. శోభాకి యంగ్ ఏజ్ లోనే చేదు అనుభవం అని భావిస్తున్నారు నెటిజన్స్. మరి గుప్పెడంత మనసులో శోభా నిజంగానే చేయాల్సి వస్తే.. ఎలాంటి క్యారెక్టర్ సూట్ అవుతుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.