తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే.. కొన్నేళ్లుగా సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ వెనకబడి తిరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏ షోలో కనిపించినా లవ్, ప్రపోజల్స్, డ్యూయెట్స్ అంటూ రెచ్చిపోయారు. ఫ్యాన్స్ లో కూడా సుధీర్ – రష్మీ నిజంగా పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుంటుందని భావించారు.
ఇంతలో సుధీర్ – రష్మీ.. మా కెమిస్ట్రీ అంతా షోల వరకే పరిమితం అని తేల్చేసరికి అంతా షాకయ్యారు. కానీ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ పెళ్లి సీన్ రిపీట్ చేసినట్లు తెలుస్తుంది. ఇదివరకు ఓ షో కోసం సుధీర్ – రష్మీలకు పెళ్లి చేశారు నిర్వాహకులు. ఇప్పుడు మరో కొత్త అమ్మాయితో సుధీర్ కి నిశ్చితార్థం, పెళ్లి చేస్తున్నట్లు లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది.లేటెస్ట్ ప్రోమో చూసేసరికి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇంతకీ సుధీర్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? అసలు ఇది నిజమైన పెళ్లేనా.. ఒకవేళ సుధీర్ కి కాబోయే భార్య నిజంగా ఈ అమ్మాయే అయితే.. అలా బెడ్ రూమ్ సీన్స్ లో ఎలా యాక్ట్ చేస్తారు? ఇదంతా షో పర్పస్ యేనా..? సరే ఇదంతా ఓ పక్కన పెట్టినా.. ఆల్రెడీ సోషల్ మీడియాలో, టీవీ షోలలో పరిచయమున్న వాళ్లని సుధీర్ కి జంటగా పెడితే ఫేక్ అనుకుంటారని.. కొత్తమ్మాయిని తీసుకొచ్చి ఉంటారని కూడా నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొత్తమ్మాయితో సుధీర్ పెళ్లి నిజమా కాదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.