సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళంలో ‘ప్రేమమ్’ అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో..తెలుగులో కూడా ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అంతే స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఓ ఎమోషన్ అనేంతలా అభిమానులకు దగ్గరైంది. తాజాగా సుమ కనకాల హోస్ట్ చేస్తున్న క్యాష్ షో కి ఈ వారం గెస్ట్ గా సాయిపల్లవి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు ఓ స్టూడెంట్ లవ్ ప్రపోజ్ చేశాడు. దీనికి పల్లవి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చి అందరిని ఆకట్టుకుంది.
తెలుగు బుల్లితెరపై తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తూ సుమ కనకాల చేసే సందడి అంతాఇంతా ఉండదు. దాదాపు చాలా షోల్లో, మూవీ ఈవెంట్లుకి హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమ హంగామా చేస్తోంది. హీరోయిన్లకి ఉన్న రేజ్ లో సుమకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్యాష్ అనే ప్రోగ్రాం లో సుమ యాంకర్ గా చేస్తూ .. ప్రతి వారం అతిధులుగా వచ్చే సెలబ్రిటీలతో కలసి సందడి చేస్తుంది. అలానే ఈ వారం క్యాష్ షో కి ముఖ్య అతిధులు గా ‘విరాటపర్వం’ మూవీ డైరెక్టర్ వేణు ఉడుగుల, నవీన్ చంద్ర, సాయి పల్లవి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర పాల్గొన్నారు. ‘విరాట పర్వం’ మూవీ టీమ్ తో సుమ తెగ సందండి చేసింది. ఈక్రమంలో గూగుల్ సెర్చ్ లో సెర్చ్ కొట్టిన దొరకని ప్రశ్నలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అడగాలనుకుంటున్నారు అంటూ సుమ అంటుంది.
ఇదీ చదవండి: ప్రైవేట్ సాంగ్‌లో హాట్ డాన్స్ తో రెచ్చిపోయిన కేతికా శర్మ! వీడియో వైరల్!
ఈక్రమంలో ఓ స్టూడెంట్.. సాయిపల్లవి గారు మీకు ఎలా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు? అని అడుగుతాడు. “నేను ఫీలైయితే యాక్సెప్ట్ చేస్తాను” అంటూ సాయిపల్లవి సమాధానం చెప్తుంది. వెంటనే ఆమె దగ్గరి వెళ్లి… “ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నా నాకు మీరే ఎందుకు నచ్చారో తెలియదు” అంటూ ప్రపోజ్ చేస్తాడు. అక్కడ వారందరు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. తాజాగా విడుదలైన ఈ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.