బాలీవుడ్ బాద్ షాతో తమిళ స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తాడంటూ కొ్న్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందనన్న ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. తమిళంలో మాస్ డైరెక్టర్‌గా పేరును పొందాడు దర్శకుడు అట్లీ. ఆయన సినిమాలంటే తమిళంలో ఎనలేని క్రేజ్. మాస్ సినిమాల్లో తెరకెక్కించటంలో అట్లీ ఆరితేరాడు. అందుకే బాలీవుడ్ స్టార్‌లు సైతం ఆయనతో సినిమా చేసేందుకు ఇష్టపడతారు.
ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇదిలా ఉంటే అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసేందుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన జోడిగా కనపించనుందట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఎన్‌ఐఏ అధికారి, మరొకటి గ్యాంగ్ స్టర్. ఈ రెండు పాత్రల్లో షారుఖ్ కనిపించబోతోన్నట్టు టాక్. ఇక తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి సినిమా ఈ నెలలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వీరి మూవీ అనౌన్స్ ఉండబోతుందని తెలుస్తోంది.