రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరోసారి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి మూవీ మరోసారి సత్తా చాటింది.
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరోసారి సత్తా చాటింది. అంతర్జాతీయ వేదికపై జక్కన్న మూవీ మరోమారు మెరిసింది. గ్లోబల్ లెవల్లో ఇప్పటికే పలు పురస్కారాలు అందుకున్న ఈ చిత్రం తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్లో విశేషంగా భావించే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల్లో ఈ సినిమా ఏకంగా ఐదింటిని సొంతం చేసుకుని సగర్వంగా నిలిచింది. ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (నాటు నాటు), ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ ఇలా పలు విభాగాల్లో ప్రముఖ చిత్రాలను వెనక్కి నెట్టింది ‘ఆర్ఆర్ఆర్’. అవార్డుల రేసులో ‘బ్లాక్ పాంథర్’, ‘ది వుమెన్ కింగ్’, ‘ది బ్యాట్మన్’ వంటి ఫారెన్ మూవీస్‌ను వెనక్కి నెట్టి ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ అందుకుంది.
భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఆడియెన్స్ నుంచి విశేషంగా ఆదరణ దక్కించుకున్న సినిమాగా పేరు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. ‘హెచ్‌సీఏ స్పాట్లైట్’ పురస్కారాన్నీ దక్కించుకుంది. తద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ఎంతగానో పెంచింది. మన చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘ఆర్ఆర్ఆర్’కు బెస్ట్ స్టంట్స్ అవార్డు అందించినందుకు హెచ్‌సీఏ సభ్యులకు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూవీ కోసం ఎంతగానో శ్రమించి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కంపోజ్ చేసిన జూజీకి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా కోసం ఇండియాకు వచ్చి.. తమ విజన్‌ను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్ మాస్టర్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘ఇకపై మీ అవార్డుల లిస్టులో స్టంట్ కొరియోగ్రాఫర్స్ విభాగాన్ని కూడా చేర్చాలని కోరుతున్నా. సినిమాలోని రెండు, మూడు షాట్స్‌లో మాత్రమే మేం డూప్స్‌ను వాడాం. మిగతావన్నీ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వయంగా చేశారు. వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. 320 రోజుల ఈ మూవీని షూట్ చేయగా.. అందులో ఎక్కువ భాగం స్టంట్స్ కోసమే పనిచేశాం. ఇది నా సినిమాకే కాదు.. మొత్తం భారతీయ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్ మహాన్. జై హింద్’ అంటూ రాజమౌళి పేర్కొన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ‘నాటు నాటు’ పాటను పాడటం విశేషం. మరి.. ఇన్ని ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో ఆస్కార్ అవార్డు కూడా చేరుతుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
And the HCA Award Acceptance for Best Action Film …
RRR#RRR #RRRMovie #RamCharan #SSRajamouli #NTRamaRaoJr #HCAFilmAwards #BestActionFilm pic.twitter.com/9BfCHf4Swj
— Hollywood Critics Association (@HCAcritics) February 25, 2023