యాంకర్ శ్రీముఖి అనే కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగు ప్రేక్షకులకు శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పని లేదు. అటు యాంకరింగ్ మాత్రమే కాకుండా స్పెషల్ ఈవెంట్స్, సినిమాల్లోనూ శ్రీముఖి తానేంటో నిరూపించుకుంది. ఇటీవల మ్యాస్ట్రో సినిమాలో విలన్ భార్యగా నటించి మెప్పించిన ఆమెకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అటు బిజినెస్ ఉమెన్ గా కూడా శ్రీముఖి తానోంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ నిర్వహిస్తోంది. అటు యూట్యూబ్ లోనూ శ్రీముఖి ట్రెండీ వీడియోస్, వ్లాగ్స్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ఇదీ చదవండి: సినీ కార్మికులను ఆదుకున్న దేవుడు చిరంజీవి: మంత్రి మల్లారెడ్డి
శ్రీముఖి సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటో షూట్స్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు మోడ్రన్, మరికొన్నిసార్లు ట్రెడిషన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. స్టార్ హీరోయిన్ కు తీసిపోని ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. గ్లామర్ ఫొటోషూట్ విషయంలో మాత్రం బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ, రష్మీ వంటి వారికి గట్టి పోటీ ఇస్తుంటుంది శ్రీముఖి. తాజాగా ఓ బ్లాక్ టాప్ లో చేసిన ఫొటోషూట్ ప్రేక్షకుల మతిపోగొడుతోంది. పొట్టి టాప్ లో ఆమె ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాయి.
Birthday month! 🖤✨
Hello May 🖤✨#sreemukhi #MayDay2022 pic.twitter.com/0tB2TPrMe5— SreeMukhi (@MukhiSree) May 1, 2022
ఇంక టీవీ షోల విషయానికి వస్తే.. కొత్తగా జాతిరత్నాలు షో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. గతంలో నిర్వహించిన పటాస్ తరహాలోనే ఈ షో కూడా సాగుతోంది. కొందరు కొత్త టాలెంటెడ్ యూత్ ను తీసుకొచ్చి వారితో స్టాండప్ కామెడీ చేయిస్తున్నారు. అయితే పటాస్ కు వచ్చిన రెస్పాన్స్ అయితే ఈ షోకి వచ్చినట్లుగా కనిపించడం లేదు. కాకపోతే న్యూ టాలెంట్ ను పరిచయం చేసేందుకు మాత్రం ఈ షో కచ్చితంగా ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Few more 🖤✨ pic.twitter.com/ngdzkUjtUu
— SreeMukhi (@MukhiSree) May 1, 2022
— SreeMukhi (@MukhiSree) May 1, 2022