మార్వెల్ యూనివర్స్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కనక వర్షం కురిపించాయి. మార్వెల్ మూవీస్‌లో స్పైడర్ మ్యాన్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల టామ్ హాల్యాండ్- జెండాయా జంటగా నటించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాని 200 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే 1.09 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.
సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే సగానికి పైగా గ్రీన్ మ్యాట్ లు, గ్రాఫిక్స్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకి సంబంధించి అంతకు మించిన విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. స్పైడ్ మ్యాన్ నో వే హోమ్ సినిమాలో చాలా వరకు టామ్ హాలెండ్ స్పైడీ సూట్ మొత్తాన్ని సీజీ చేశారంట. అందుకోసం దర్శకనిర్మాతలు ఎంతో వ్యయప్రయాశలకు ఓర్చారంట.
నో వే హోమ్ లో స్పైడర్ మ్యాన్ చేసిన పనికి మల్టీ వర్స్ లోని విలన్స్ అంతా వచ్చేస్తారు. వారిలో డాక్టర్ ఆక్టోపస్ ని క్యూర్ చేసిన తర్వాత స్పైడర్ మ్యాన్ సూట్ మొత్తం అప్ గ్రేడ్ అవుతుంది. అప్పటి నుంచి సెకండాఫ్ మొత్తం స్పైడర్ మ్యాన్ సూట్ 100 శాతం సీజీ చేశారు. అంతేకాకుండా ఆఖరి ఫైట్ లో కనిపించే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, లిబర్టీ ఐలాండ్ మొత్తం 100 శాతం సీజీనే అని చెబుతున్నారు.
ఈ సినిమాలో టామ్ హాలెండ్, జెండాయా మధ్య ఒక ముద్దు సీన్ కూడా ఉంటుంది. దానిని కూడా సీజీ చేసినట్లు చెబుతున్నారు. అంటే హాలీవుడ్ సినిమాలు అంటే హీరో, హీరోయిన్ల మధ్య ముద్దు సీన్ అనేది ఎంతో కామన్ అంటారు. అదికాక రియాలిటీలో టామ్ హాలెండ్, జెండాయా లవర్స్ కూడా. అయినా వారి మధ్య ముద్దు సీన్ సీజీ చేశారనడంపై ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అది అంత ఈజీగా అయ్యే పని కాదు. అందుకు చాలా డిపార్టుమెంట్లు కలిసి పనిచేయాలి. మొదట స్పైడర్ మ్యాన్ నార్మల్ సూట్ లో సీన్ లో నటిస్తాడు. ఫ్రెండ్స్ ని కలవడం, వారితో మాట్లాడటం అలా అన్నీ టామ్ హాలెండ్ నటిస్తాడు. ఆ తర్వాత అలాంటి వాతావరణం, లైటింగ్ ని ఏర్పాటు చేసుకుని సీజీలో సీన్ రీ క్రియేట్ చేస్తారు. అలా సెకండ్ హాఫ్ మొత్తం స్పైడర్ మ్యాన్ సూట్‌ని పూర్తిగా సీజీలోనే చూపించారు.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా వంద శాతం సీజీ చేశారు. అయితే టామ్ హాలెండ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ మాదిరి సెట్ లో వెనుక గ్రీన్ మ్యాట్ లో నటించగా.. దానిని సీజీలో మిక్స్ చేశారు. అలా పతాక సన్నివేశాలను గ్రాఫిక్స్ తో రక్తికట్టించారు. నిజానికి హాలీవుడ్ సినిమాలంటే సీజీ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అని తెలిసినా.. టెక్నాలజీని ఈ స్థాయిలో ఉపయోగించడంపై ప్రేక్షకులు నోరెళ్ల బెడుతున్నారు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాలో గ్రాఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.