ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సృష్టిస్తున్న రికార్డుల మోత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు రాజమౌళి రూపొందించిన మొదటి సౌత్ పాన్ ఇండియా మూవీ ‘బాహుబలి’ వచ్చి 7 ఏళ్లు అవుతోంది. అప్పటినుండి బాలీవుడ్ సినిమాలపై సౌత్ సినిమాల ఆధిపత్యం కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో పాటు.. ఈ ఏడాది విడుదలైన RRR, KGF 2 సినిమాల వరకూ బాలీవుడ్ మార్కెట్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి సౌత్ సినిమాలు.
కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కంబ్యాక్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరోల దగ్గరనుండి స్టార్ హీరోల వరకు అందరి సినిమాలపై ఈ ఏడాది అంచనాలు పెట్టుకున్నప్పటికీ, ఎటువంటి ఆశించిన ఫలితాలు రాకపోగా.. హిందీతో వివిధ భాషల్లో విడుదలై డిజాస్టర్స్ ని సొంతం చేసుకున్నాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్.. ఇలా అందరు హీరోల నుండి ఒకే ఒక్క స్ట్రాంగ్ హిట్టు కోసం చూస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ మార్కెట్ లో డబ్బింగ్ సినిమాలుగా విడుదలవుతున్న సౌత్ సినిమాలన్నీ, బాలీవుడ్ ఒరిజినల్ సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కథాకథనాలలో దమ్ము లేకపోతే సినిమాలు నిలబడడం చాలా కష్టం. అందుకే ప్రేక్షకులు కూడా కంటెంట్ ప్రధానంగా సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో.. బాలీవుడ్ లో హిందీ సినిమాలన్నీ బడ్జెట్ రాబట్టుకోవడానికే తంటాలు పడుతుంటే సౌత్ సినిమాలు బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి.. లాభాల బాటలో చేరుతున్నాయి.
ఇక బాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన దక్షిణాది డబ్బింగ్ సినిమాలన్నీ అద్భుతమైన నెట్ కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం సౌత్ నుండి విడుదలై బాలీవుడ్ మార్కెట్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ లిస్టులో ముందంజలో కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు నిలిచాయి.
2022లో హిందీలో అత్యధిక వసూళ్లు(నెట్ కలెక్షన్స్) సాధించిన సౌత్ సినిమాలు!
మరి ఈ జాబితా ప్రకారం.. హిందీ మార్కెట్ లో రానున్న రోజుల్లో మరిన్ని దక్షిణాది సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని శాసించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే.. హిందీ ప్రేక్షకులు సైతం సౌత్ సినిమాల కంటెంట్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంటే.. కంటెంట్ ఉంటే స్టార్స్ అవసరం లేదని, ఎక్కడైనా కలెక్షన్స్ రాబట్టుకోవచ్చని తాజాగా ‘కార్తికేయ 2’ సినిమా ప్రూవ్ చేసింది. మరి ఇప్పటివరకు నెట్ కలెక్షన్స్ లో టాప్ గా నిలిచిన ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Where will #Liger reach in the list? pic.twitter.com/URoD7MaZtP
— Aakashavaani (@TheAakashavaani) August 23, 2022