బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలుగా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఒకరు. న్యూస్ రీడర్ గా పాపులర్ అయిన శివజ్యోతి.. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదివి.. తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలుగా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఒకరు. న్యూస్ రీడర్ గా పాపులర్ అయిన శివజ్యోతి.. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే.. ఈమెను ఫ్యాన్స్ అందరూ ప్రేమగా జ్యోతక్క అని పిలుస్తుంటారు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శివజ్యోతి.. తెలంగాణ యాసలో వార్తలు చదివి.. తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో కొద్దికాలంలోనే ఏకంగా ‘బిగ్ బాస్ షో’లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ లో శివజ్యోతితో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పాలి.
ఆ తర్వాత హౌస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి శివజ్యోతి లైఫ్ పూర్తిగా మలుపు తిరిగింది. ఓవైపు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో.. మరోవైపు వరుస ఈవెంట్స్ తో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా శివజ్యోతి.. అప్పుడప్పుడు భర్తను కూడా తీసుకొచ్చి టీవీ షోస్ లో సందడి చేస్తుంటుంది. అంతేగాక సోషల్ మీడియా గురించి పెద్దగా అవగాహన లేని ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో లక్షలలో ఫ్యాన్స్ ని సంపాదించుకొని దూసుకుపోతోంది. అయితే.. ఇన్నాళ్లు టీవీ ఛానల్ లో వార్తలు చదువుతూనే.. టీవీ ప్రోగ్రామ్స్, సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వచ్చిన శివజ్యోతి.. ఇప్పుడు తన జాబ్ మానేసినట్లు కొత్త వీడియో పెట్టి అందరికీ షాకిచ్చింది.
సావిత్రి జాబ్ మానేసిందని తెలియగానే.. ఇకపై ఆమె వార్తలు వినలేమా? అని ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. కానీ.. ఇంతలోనే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆల్రెడీ సొంతంగా జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న శివజ్యోతి.. తాజాగా ‘జ్యోతక్క ముచ్చట్లు’ అని కొత్తగా మరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇకపై శివజ్యోతి తెలంగాణ యాసలో శివజ్యోతి చెప్పే.. వార్తలన్నీ ఈ ఛానల్ లోనే పోస్ట్ చేయనున్నట్లు వీడియోలో తెలిపింది. తన ఛానల్ పేరుతో పాటు.. “నా బలం మీరే నా బలగం మీరే “అనే కాప్షన్ కూడా జోడించి ఛానల్ ని సినిమా లెవెల్ లో ప్రమోట్ చేసింది. అయితే.. వీడియోలో తాను జాబ్ ఎందుకు మానేసిందో? మానేసి ఏం చేయాలనుకుందో చెబుతూ.. చాలా ఎమోషనల్ అయ్యింది శివజ్యోతి. ప్రస్తుతం జ్యోతక్క కొత్త వీడియో వైరల్ కాగా.. ఆమెకు ఫ్యాన్స్, నెటిజన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.