మహేశ్– కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేశ్ యంగ్ లుక్స్ లో అభిమానుల్లో జోష్ పెంచాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కమాన్ కమాన్ కళావతి’ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ‘పెన్నీ’ అనే మరో లిరికల్ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ సాంగ్ లో మరో ప్రత్యేకత ఎంటంటే.. సితార ఘట్టమనేని కూడా నటించడం. సితార మ్యూజిక్ వీడియోలో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో మహేశ్ అభిమానుల్లో ఇంకా ఆసక్తి పెరిగింది. ఆ లిరికల్ ప్రోమో మీరూ చూసేయండి. సితార డాన్స్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.