సాధారణంగా సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ ఉన్న సెలబ్రిటీల వారసులైనా సొంత టాలెంట్ మీదే పైకి రావాల్సి ఉంటుంది. అయితే.. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఉన్నత స్థాయిలోనే చూడాలని అనుకుంటారు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను కూడా వారే దగ్గరుండి చూసుకుంటారు. సినీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి తమ పిల్లలను హీరోలుగా, హీరోయిన్స్ గా చూడాలని భావిస్తుంటారు. కొన్నేళ్లుగా సింగర్ సునీత కూడా తన కొడుకు ఆకాష్ ని హీరోగా, మంచి నటుడిగా చూడాలని వెయిట్ చేస్తుందట.
ఈ విషయం సునీత ఎప్పుడూ బయటకు గట్టిగా చెప్పలేదు. కానీ.. తనయుడిని హీరోని చేసేందుకు ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తోందట. ఇటీవల సునీత తన కొడుకు ఆకాష్ కి సోషల్ మీడియాలో బర్త్ డే విషెష్ చెబుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గెటప్స్ లో ఫోటోషూట్ చేసి.. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సునీత. ఈ క్రమంలో హ్యాపీ బర్త్ డే అని చెప్పి.. నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ క్యాప్షన్ లో జోడించింది. దీంతో సునీత కొడుకు త్వరలోనే నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే విషయం అందరికి అర్థమైపోయింది.
ఇక ఆకాష్ కి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. మరోవైపు సునీత కూడా ఆకాష్ ని సోషల్ మీడియాలో బాగానే ప్రమోట్ చేస్తోంది. అదీగాక ఆకాష్ కూడా చూడటానికి మంచి హ్యాండ్సమ్ లుక్, ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు. సో.. నటన పరంగా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా యాక్టర్ గా క్లిక్ అవుతాడని నెటిజన్స్, సునీత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సింగర్ సక్సెస్ అయిన సునీత.. కూతురు శ్రేయని కూడా గతంలో సింగర్ గా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మరి చూడాలి.. సింగర్ సునీత కొడుకు ఆకాష్ ఎప్పుడు మూవీ అనౌన్స్ చేస్తాడో..!