తెలుగు నాట సింగర్ సునీతకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు సునీత. తన మధుర గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సునీత అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు సునీత.
‘పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంది’ అని సునీతను ప్రశ్నించగా.. ‘‘దానికి సమాధానం మా ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా.. గౌరవంగా జీవించాలని భావించాను. అలాగే ముందుకు వెళ్తున్నాను. ఇక నేను, రామ్ ఇద్దరం ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు నా సాయం కావాలంటే.. తప్పకుండా చేస్తా.. ప్రొఫెషనల్ కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి : అందంలో అమ్మని మించిపోయిన సునీత కూతురు!
ఇక ఈ ఏడాది జరిగిన విషాదాలపై సునీత స్పందిస్తూ.. ‘‘2021 నాకే కాదు చాలామందికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాది ఎందరో ఆప్తులను దూరం చేసుకున్నాను. ముఖ్యంగా బాలు గారు మనల్ని విడిచి పెట్టి వెళ్లారు. ఆయన మరణం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి… ఇంకిపోయాయి. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది కానీ.. అంతగా నన్నేమీ కదిలించడం లేదు. ఇక బాలు గారు లేని లోటు తీర్చలేనిది’’ అంటూ సునీత భావోద్వేగానికి గురయ్యారు. సునీత వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : రామ్‌ను పెళ్లి చేసుకోవటానికి అదే కారణమంటున్నారు..!