సింగర్ సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా.. తన కోయిల గానంతో.. ప్రేక్షకులను అలరిస్తోంది. పాటలు పాడటమే కాక.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెర మీద వినిపిస్తోంది. చక్కని గాత్రంతో పాటు.. అందమైన రూపం సునీత సొంతం. సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమై ఫాలోయింగ్ ఉంది. ఆమెకు సంబంధించిన ప్రతి వార్త.. వెంటనే వైరల్‌గా మారుతుంది. ఇక ఏళ్ల తరబడి ఒంటరి మహిళగా ఉన్న సునీత.. రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస అవకాశాలతో.. ఇటు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో సంతోషంగా గడుపుతోంది సునీత. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సునీత కుమార్తె కూడా సింగింగ్ వైపు అడుగులు వేస్తోంది.
తాజాగా సునీత భర్త, పారిశ్రామికవేత్త వీరపనేని రామకృష్ణ బంజారహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఓ వ్యక్తి ఆయనను ఫోన్‌లో బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో సునీత భర్త వీరపనేని రామకృష్ణ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరపనేని రామకృష్ణ బంజారాహిల్స్ రోడ్ నం2లోని సాగర్ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి.. గత కొన్ని నెలలుగా రామకృష్ణకు కాల్ చేసి వేధిస్తున్నాడు. తాను నిర్మాతల మండలి సభ్యుడిని అని.. రామకృష్ణను అర్జెంట్‌గా కలిసి.. తనతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ.. వరుసగా మెసేజ్‌లు పెట్టడమే కాక.. కాల్స్ చేస్తున్నాడు.
అయితే లక్ష్మణ్ ఎవరో తనకు తెలియదని.. ఏదయినా విషయం ఉంటే.. తన ఆఫీస్‌కు వచ్చి.. సిబ్బందికి చెప్పాలని రామకృష్ణ సూచించాడు. కానీ లక్ష్మణ్ అవేం పట్టించుకోకుండా.. ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. దాంతో రామకృష్ణ అతడ నంబర్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. దాంతో లక్ష్మణ్.. వేరే నంబర్ల నుంచి కాల్ చేయడమేకాక.. నీ అంతు చూస్తానంటూ రామకృష్ణను బెదిరించసాగాడు. దాంతో శనివారం రాత్రి బాధితుడు వీరపనేని రామకృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు దీని గురించి ఫిర్యాదు చేశాడు. లక్ష్మణ్ అనే వ్యక్తి వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని.. వీలైనంత త్వరగా అతడిపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ వీరపనేని కోరాడు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడు లక్ష్మణ్ మీద ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి ఈ ఘటనపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.