రాహుల్ ద్రావిడ్ .. ఇండియన్ క్రికెట్ టీమ్ వాల్ ఆయన. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి తన ఆటతీరుతో జట్టుని ఆదుకున్న ఘనత ద్రావిడ్ ది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ గా కొత్త బాధ్యతలు చేపట్టారు. అయితే.., ఇప్పుడు ద్రావిడ్ పుణ్యమా అని ఒక స్టార్ హీరో లైఫ్ మళ్ళీ జోరు అందుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లవర్‌బాయ్‌గా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో జోరుమీద కనిపించేవాడు. తెలుగులో అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా..బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం… వంటి సినిమాలతో ఓ రేంజ్‌కి వెళ్లిపోయాడు. అయితే ఎంత స్పీడ్‌గా కెరీర్‌లో పైకి దూసుకెళ్లాడో.. అంతే స్పీడ్‌గా టాలీవుడ్ నుంచి వెళ్లిపోయాడు. అడపాదడపా తమిళ్ డబ్బింగ్ మూవీలు చేస్తున్నా .. పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. సిద్ధార్థ్ పని ఇక అయిపోయినట్టే అనుకుంటున్న సమయంలో మళ్లీ కంబ్యాక్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు.
సిద్దార్థ ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘మహాసముద్రం’ అనే సినిమాలో చేస్తున్నాడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో శర్వానంద్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ ఇద్దరిలో ఒకరు నెగిటివ్ రోల్‌లో కనిపించనుండగా… అది సిద్దార్థనా లేక శర్వానా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. ఇప్పుడు ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. మరో సినిమాతో తెరపైకి వస్తున్నాడు సిద్దార్థ.
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల జోరు పెరిగింది. ఈ క్రమంలోనే భారత్ దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాహుల్ క్యారెక్టర్ కోసం సిద్దార్ధను ఎంపిక చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ విన్న వెంటనే ద్రావిడ్ ఓకే చెప్పగా.. ఇప్పుడు సిద్ధార్థతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ మూవీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. రాహుల్ ద్రావిడ్ పాత్రకి సిద్దార్ధ్ ఎంత వరకు న్యాయం చేస్తాడో చూడాలి.