ఇండియన్ క్రికెట్ కు ఇండియన్ సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ వేరు వేరు అని చెప్పలేం. ఎందుకంటే క్రికెటర్లు హీరోయిన్లను ప్రేమించడం, పెళ్లాడటం, క్రికెటర్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇప్పటికే చాలా సార్లు చూశాం. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ లు వెండితెరపై తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఇంక బాలీవుడ్ బ్యూటీలు, టీమిండియా యంగ్ క్రికెటర్లు చెట్టాపట్టాలేసుకు తిరగడం అందరికీ తెలిసిందే. తాజాగా ధోనీ సైతం ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోకనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పడు ఆ జాబితాలోకి టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేరనున్నట్లు తెలుస్తోంది.
క్రికెటర్ గా శిఖర్ ధావన్ కు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని బ్యాటింగ్ మాత్రమే కాదు, సెంచరీ కొట్టాక, క్యాచ్ పట్టాక చేసుకునే సెలబ్రేషన్ కు సైంత సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు కేవలం క్రికెట్ తో మాత్రమే కాకుండా తన నటనతోనూ అభిమానులను అలరించాలని శిఖర్ ధావన్ భావించినట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు ఊపందుకున్నాయి. అయితే గతంలోనే అక్షయ్ కుమార్ తో కలిసి శిఖర్ ధావన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలింది.
ఇదీ చదవండి: OTTలో స్ట్రీమ్ అవుతున్న ‘సన్ ఆఫ్ ఇండియా’.. ఎక్కడంటే?అయితే సైడ్ క్యారెక్టర్, ప్రత్యేక పాత్రల్లో కాకుండా నేరుగా హీరోగా వెండితెర ఎంట్రీ ఇవ్వాలని శిఖర్ భావించాడట. అందుకే సింగిల్ హీరోగా భారీ బడ్జెట్ లో సినిమా తీసినట్లు సమాచారం. అవును మీరు చదివింది కరెక్టే.. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఆ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదంట. శిఖర్ ధావన్ రీల్స్, డాన్స్ వీడియోలు చాలానే చూశాం. అవి చూసినప్పుడు శిఖర్ కు నటనపై ఆసక్తి ఉందని ఇట్టే చెప్పేయచ్చు. అయితే హీరోగా సినిమాలో నటించే అంత ఇష్టం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే శిఖర్ హీరోగా సినిమా తెరకెక్కింది అనే దానిపై ఇంకా ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. అది పుకారా లేకా నిజమా అనేది తెలియాలి అంటే గబ్బర్ క్లారిటీ ఇచ్చే దాకా ఆగాల్సిందే. హీరోగా శిఖర్ ధావన్ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.