చిత్రపరిశ్రమలో నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరైనా కెరీర్ పరంగా విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ఫేస్ చేయడం చాలా కామన్. కొన్నిసార్లు అనుకోకుండా ఆవేశంలో మాట్లాడిన మాటలే వివాదాలకు దారి తీయవచ్చు. మరికొన్నిసార్లు నోరు జారి మాట్లాడినవే విమర్శలు గుప్పించవచ్చు. ఇలాంటివి ఏ పొరపాట్లు జరిగినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరే ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఏమైందో గాని.. నటుడు, కమెడియన్ షకలక శంకర్.. మాస్ రాజా రవితేజకి ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం శంకర్ రవితేజకి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అసలు షకలక శంకర్ ఎందుకు రవితేజకి క్షమాపణలు చెప్పాడు? అనే విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా శంకర్ నటించిన రాజయోగం అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ మాట్లాడుతూ.. ఓ కాంట్రవర్సీ ప్రొడ్యూసర్ పై కామెంట్స్ చేస్తూ ఓ హీరోని వాడు వీడు అని సంబోధించాడు. దీంతో అసలు శంకర్ ఎవరిని అన్నాడు? అనేది ఆరా తీస్తే.. మాస్ రాజా నటించిన ధమాకా సినిమా కలెక్షన్స్ పరంగా థియేటర్స్ లో దూసుకుపోతుంది. దానికి సంబంధించి సక్సెస్ మీట్ ని ఇటీవలే నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పాల్గొని తన స్పీచ్ తో స్టేజ్ పై రచ్చ చేశాడు. అలాగే కొన్ని వివాదాస్పదమైన పదాలు కూడా నోరు జారాడు.
‘అందరూ రెండు మూడేళ్లు ట్రై చేసి.. అదృష్టం కలిసొచ్చి సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ అయిపోతారు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాజయోగం ప్రమోషన్స్ లో బండ్ల గణేష్ మాటలపై షకలక శంకర్ రియాక్ట్ అవుతూ.. “మొన్న ఓ ప్రొడ్యూసర్ అన్నాడు. రెండు మూడేళ్లకే అదృష్టం కలిసొచ్చి మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయిపోతారని. వాళ్ళు రెండు మూడేళ్ళలో స్టార్స్ కాలేదు. ఎన్నో ఏళ్ళు కష్టపడి పైకొచ్చారు. అనేవాడికి తెలియాలి. నీ ఎదురుగా ఎవడో హీరో ఉంటే ఉబ్బిపోయి అలా మాట్లాడకూడదు” అన్నాడు. దీంతో ధమాకా మీట్ లో బండ్ల ఎదురుగా ఉంది రవితేజ. కాబట్టి.. రవితేజనే ఎవడు అంటావా అని ఫ్యాన్స్, నెటిజన్స్ ఫైర్ అయ్యారు. దాంతో చేసేదేం లేక ‘తాజాగా ఓ వీడియో ద్వారా.. “ఫ్లోలో మిమ్మల్ని వాడు వీడు అనేశాను. వీలైతే క్షమించండి. రవితేజ ఫ్యాన్స్ కి థాంక్స్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి శంకర్ మాటలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.