షారుక్ ఖాన్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌లో బాద్ షాగా ఎదిగాడు. భారతీయ సినిమాలో కింగ్ అని బిరుదు అందుకున్నాడు. షారుక్ ఖాన్ ఎంతో సింపుల్‌గా ఉండే వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారిలో షారుక్ ఖాన్ కూడా ఒకడు. ఫ్యాన్స్ విషయంలో షారుక్ ఖాన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంటాడు. ఒక బాద్‌షాగా ఎదిగిన వ్యక్తి ఇంత సింపుల్‌గా ఉంటాడా అంటూ అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు.
కెరీర్‌లో ఎన్నో రికార్డులు నమోదు చేసిన షారుక్ గత నాలుగేళ్లుగా షారుక్ సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్క సరైన హిట్ కూడా లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అసలు సినిమాలే తీయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు జవాన్ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ జవాన్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటిస్తోంది.
Be Like Shah Rukh Khan ♥️ @iamsrk pic.twitter.com/EmVmDtHNAP
— Shah Rukh Khan Fan Club – Pune पुणे (@SRKFC_PUNE) August 26, 2022
అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలపై నెగటివ్ ప్రచారాలు, ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అటు షారుక్ ఖాన్‌పై కూడా ట్రోలర్స్ విరుచుకుపడటం చూస్తున్నాం. ప్రతి విషయంలో షారుక్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే అందుకు షారుక్ ఖాన్ ఫ్యాన్స్ అంతా స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తున్నారు. అసలు షారుక్ ఖాన్ ఇది అంటూ ఓల్డ్ వీడియోలు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Look at this one, in Melbourne! I was so lucky that I watched it live. @iamsrk performing with Autistic kids. pic.twitter.com/h8S0cwSMSL
— Aadi (@Adeebkhan) August 25, 2022
ఆ ఓల్డ్ వీడియోలలో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మందిని షారుక్ ఖాన్‌ని ఆరాదించేలా చేస్తోంది. ఓసారి లిటిల్ ఛాంప్స్ ప్రోగ్రామ్‌లో షారుక్ ఖాన్ పాల్గొన్నాడు. అక్కడ తనను ఎంతో అభిమానించో ఓ దివ్యాంగ యువతిని షారుక్ కలుసుకున్నాడు. ఆమెను కలిసి తన కల నేరవేర్చడమే కాకుండా.. ఆమెతో ఆడిపాడాడు.
how can you hate this person.#ShahRukhKhan @iamsrk pic.twitter.com/PhVBkFFkbW
— Herry (@Oyepathaan) August 24, 2022
దిల్ సే సినిమాలోని ఛయ్య ఛయ్య సాంగ్‌కు మోకాళ్లపై కూర్చుని షారుక్ స్టెప్పులేశాడు. షారుక్ తోపాటు ఆమెకూడా వీల్ చైర్‌లో కూర్చుని పాట పాడుతూ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో షేర్ చేస్తూ.. 6 నుంచి 60 ఏళ్ల వాళ్ల వరకు అందరూ షారుక్ ఖాన్ ఇందుకే ఇష్టపడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న షారుక్ ఖాన్ ఓల్డ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is why everyone from 6 to 60 loves SRK and can’t have enough of him. It’s not about his films only. It never was! @iamsrk
— Sohini M. (@Mittermaniac) August 25, 2022