రెండు రోజుల నుంచి అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమెని ఎవరైనా అసభ్యపదజాలంతో దూషిస్తూ పెట్టిన ట్వీట్స్‌ను ఆమె రీట్విట్ చేస్తూ వారి పరువు తీస్తున్నారు. దీంతో కొంతమంది భయపడి ట్వీట్స్ డిలీట్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనసూయని ట్రోల్ చేస్తున్నారు. అయితే అనసూయకి సపోర్ట్ చేస్తూ శ్రద్ధాదాస్ ఒక ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈమె మీద కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీనిపై శ్రద్ధాదాస్ స్పందించారు. ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టారు. అనవసరంగా నన్ను దూషిస్తూ మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారు. నేను మాత్రం బ్లాక్ చేసి డిలీట్ చేస్తా. ఇదసలు పాయింట్లెస్. అనసూయ లుక్స్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు నన్ను ట్రోల్ చేయడంలో అర్ధం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇక అనసూయని నెటిజన్లు ఆంటీ అంటూ వెకిలి చేష్టలతో కావాలని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనసూయ "మీ ఎవ్వరికీ నేను ఆంటీని కాదు. 25 ఏళ్ళు దాటితే.. పిల్లలు ఉంటే ఆంటీ అంటారా? మరి ఇండస్ట్రీలో 25 ఏళ్ళు దాటిన హీరోలని అంకుల్స్ అని పిలుస్తారా" అంటూ కౌంటర్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్‌కి మద్ధతు పలుకుతూ శ్రద్ధాదాస్ ఒక ట్వీట్ చేశారు. "మీ వయసులో సగం వయసున్న అమ్మాయిల కంటే, మీ కంటే పెద్ద వయసున్న అంకుల్స్ కన్నా మీరే అందంగా ఉన్నారు" అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లకి ఎక్కడో కాలి ఇప్పుడు శ్రద్ధాదాస్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే శ్రద్ధాదాస్ అనవసరంగా తనని ట్రోల్ చేసి సమయం వృధా చేసుకోవద్దని నెటిజన్లకి సూచించారు. మరి ట్విట్టర్లో జరుగుతున్న ఈ ట్వీట్ల వార్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ ద్వారా, రియాక్షన్ ఏంటో ఎమోజీ ద్వారా తెలపండి. Guys you will waste your time and energy abusing me,I only block and delete. So pointless. It’s senseless for you to troll me for complimenting @anusuyakhasba on her looks ! Get well soon — Shraddha das (@shraddhadas43) August 26, 2022 ఇది కూడా చదవండి: పైసా ఖర్చు లేకుండా నయనతార దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే.. ఇది కూడా చదవండి: వర్జినిటీపై ప్రశ్నకు ఘాటుగా జవాబిచ్చిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి!