‘జెర్సీ’ తెలుగులో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరీనే దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకో ఆసక్తికర విషయం ఉంది. తెలుగులో హీరో నాని కోచ్ పాత్రలో సత్యరాజ్ నటించి.. మెప్పించాడు. ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ కోచ్ పాత్రలో పంకజ్ కపూర్ నటిస్తున్నారు. అందులో ఏముంది అంటారా? షాహిద్ కపూర్.. పంకజ్ కపూర్ తండ్రి. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్నారు. అది కూడా అతని కుమారుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2015లో షాందార్ సినిమాలో వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
జెర్సీ సినిమాలో తన తండ్రితో మొదటి షాట్ ఎక్స్పీరియన్స్ ను షాహిద్ కపూర్ షేర్ చేసుకున్నాడు. ఆ షాట్ తీశాక డైరెక్టర్ అన్న మాటలను షాహిద్ చెప్పుకొచ్చాడు. టీ తాగుతూ చేసే సీన్ అది. షాట్ అయ్యాక గౌతమ్ వెళ్లి షాహిద్ కపూర్ తో.. పంకజ్ కపూర్ ఔట్ స్టాండింగ్ గా చేశారు. నువ్వు ఎంత బాగా యాక్ట్ చేసినా కూడా.. నిన్ను ఎవరూ చూడరు. అంటూ చెప్పిన విషాన్ని గుర్తు చేసుకున్నాడు. తన తండ్రితో కలిసి మళ్లీ వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు. యూట్యూబ్ లో ప్రస్తుతం జెర్సీ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. తెలుగులో సాధించిన స్థాయిలోనే హిందీలోనూ సక్సెస్ అవుతుందనే భావన కలిగిస్తున్నాడు గౌతమ్. జెర్సీ మూవీ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.