వెండితెరపై ఇప్పుడు కనిపిస్తున్న చాలా మంది నటీనటులు.. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడపా దడపా సినిమాల్లో కనిపించిన వారే. కమల్ హాసన్ దగ్గర నుండి నేటి శ్రీలీల వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారే.
వెండితెరపై ఇప్పుడు కనిపిస్తున్న చాలా మంది నటీనటులు.. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడపా దడపా సినిమాల్లో కనిపించిన వారే. కమల్ హాసన్ దగ్గర నుండి నేటి శ్రీలీల వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారే. వీరిలో అతికొద్ది మంది మాత్రమే ఆ తర్వాత హీరో,హీరోయిన్లుగా మారి స్టార్ స్టేటస్‌ను పొందారు. చాలా కాలం సినీ పరిశ్రమలో కొనసాగారు. కమల్ హాసన్, మీనా, శ్రీదేవి, తరుణ్, షాలిని, షామిలి, సునయన, తేజ సజ్జా వంటి వారు ఆ కోవకే వస్తారు. అలాగే చిన్నతనంలో ఒక్క సినిమా చేసి.. ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా వచ్చిన వారున్నారు. యాడ్స్ ద్వారా మెప్పు పొందిన చిన్నారులు.. ఆ తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
‘ఐ యామ్ ఎ కాంప్లైన్ గార్ల్, ఐ యామ్ ఎ కాంప్లైన్ బాయ్’అంటూ సాగే వీడియోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తారు. అప్పట్లో ఈ యాడ్ చూడని వారు ఉండరు. చాలా యాక్టివ్ గా కనిపించిన ఈ ఇద్దరు చిన్నారులు.. ఆ తర్వాత స్టార్లుగా మారారు. ఇందులో ఉన్న అమ్మాయి మన తెలుగులో కనిపించింది. అలాగే ఈ పిల్లవాడు.. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఇంతకు ఆ చిన్నారులు ఎవరు అనుకుంటున్నారా.. తొలి నాళ్లలో రొమాంటిక్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్.. ఆ అమ్మాయి.. ఆయేషా టకియా. షాహిద్ కపూర్ ఇప్పటికీ బాలీవుడ్లో రాణిస్తూనే ఉన్నారు.2003లో సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టిన షాహీద్.. వివాహ్ చిత్రంతో ఫేమస్ అయ్యారు.
తొలుత రొమాంటిక్ సినిమాలు చేస్తూ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకన్నారు షాహిద్. ఆ తర్వాత యాక్షన్ సినిమాల వైపు దృష్టి పెట్టారు. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించి.. టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. జెర్సీ రీమేక్ లో మెరిశారు. అలాగే మొన్న వెబ్ సిరీస్ ఫర్జీలో కూడా తన మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఆ వీడియో కనిపిస్తున్న చిన్నారి ఆయేషా టకియా కూడా తెలుగులో ఒకే ఒక్క సినిమాలో కనిపించింది. పూరి జగన్నాథ్, నాగార్జున కాంబోలో వచ్చిన సూపర్ మూవీలో హీరోయిన్గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమా ద్వారానే తెలుగు టాప్ హీరోయిన్ అనుష్క పరిచయమైంది. షాహిద్, ఆయేషా కాంబోలో హిందీలో రెండు సినిమాలు వచ్చాయి.