చిత్రపరిశ్రమని కొన్నాళ్లుగా వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఎంతగానో అభిమానించే సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్ కన్నుమూసిన వార్త ప్రేక్షకులను విషాదంలో ముంచేసింది. శాండల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు లక్ష్మణ్ వయసు 74 ఏళ్ళు. కాగా, ముదలపాళ్యలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. వయసు మీదపడటంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న లక్ష్మణ్.. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట.
ఇక నటుడిగా కన్నడ ఇండస్ట్రీలో ఎంతో పేరొందిన లక్ష్మణ్.. ఎక్కువగా విలన్, నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలతో పాపులర్ అయ్యారు. కెరీర్ లో సుమారు 200 లకు పైగా సినిమాలు చేశారు. అలాగే రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి దిగ్గజ నటుల సినిమాలలో ఎన్నో పేరు తెచ్చిన పాత్రలు పోషించారు. 1980లో ‘ఉషా స్వయంవర’ కన్నడ నాటకంలో చిన్న పాత్ర ద్వారా నట ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే.. హీరో అంబరీష్ చేసిన ‘అంతా’ సినిమాలో ఇన్స్పెక్టర్ కుల్వంత్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటుడిగా లక్ష్మణ్ కెరీర్ కి కూడా అంత ఈజీగా వెలుగులోకి వచ్చింది కాదట.
చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మీదపడటంతో 10వ తరగతి వరకే చదువుకున్నారట. అదీగాక సినిమాలలోకి రాకముందు చిన్న ఫ్యాక్టరీలో పనిచేశాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం గుండె నొప్పితో బాధపడుతున్న లక్ష్మణ్ ని హాస్పిటల్ లో చూపించి.. టెస్టులన్నీ చేసి ఇంటికి తీసుకొచ్చారట. అనంతరం సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి.. పలువురు శాండల్ వుడ్ ప్రముఖులు లక్ష్మణ్ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. అలాగే ఈ సీనియర్ నటుడికి సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం తెలియజేశారు.
Veteran Kannada actor #Lakshman passes away. He died due to heart attack..#RIP
#sandalwoodfilmsupdate pic.twitter.com/KNfekIUzYK
— Sandalwood Films Update (@FlimsUpdates) January 23, 2023
ಕನ್ನಡದ ಹೆಸರಾಂತ ಹಿರಿಯ ನಟ ಲಕ್ಷ್ಮಣ್ ಅವರು ಹೃದಯಾಘಾತದಿಂದ ನಿಧನರಾಗಿದ್ದಾರೆ
*Followus* 👉 @Cinimall#Cinimall #Kannada #lakshman #actor #rip pic.twitter.com/6gSBwDLGSU
— Cinimall ಸಿನಿಮಾಲ್ (@Cinimall) January 23, 2023