Child Actors: సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు కొన్ని సందర్భాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా ఎంతో ఫేమస్ అవుతారు. ముద్దు ముద్దు మాటలతో, అమాయకమైన ముఖంతో చూడగానే ఆకట్టుకుంటారు. చిన్న వయసులోనే తమదైన నటనతో కట్టిపడేస్తారు. అదీగాక చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికి కొందరు మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. పెద్దయ్యాక కొందరు హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంటారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతన్న వారిలో బేబీ షామిలి, షాలినీ, అక్కినేని వారసుడు అఖిల్, తేజ సజ్జ, తరుణ్, బాలాదిత్య, మాస్టర్ భరత్ తదితరులు ఉన్నారు. మరి చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ఆకట్టుకున్న ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ఎలా ఉన్నారో చూద్దాం.
షామిలి:
బేబీ షామిలి ఈ పేరు తెలియని వారు ఉండరు. బాల నటిగా తన ముద్దు ముద్దు మాటలతో ఎందరో అభిమానులను సంపాదించుంది. హీరోయన్‌లకు సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది.
అక్కినేని అఖిల్:
సిసింద్రీ సినిమాతో అందరి మనసులు దోచేశాడు అఖిల్. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.
తరుణ్:
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన తరుణ్.. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్ల పాటు వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా నిలిచాడు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.
తేజ సజ్జ:
ఇంద్ర సినిమాలో చిరంజీవి పిల్లాడుగా ఉన్నప్పటి క్యారెక్టర్‌లో కనిపించి.. తొడ గొట్టి అందరిని అబ్బురపరిచిన ఆ చిచ్చర పిడుగు పేరు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.
మాస్టర్ భరత్:
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన మాస్టర్ భరత్.. కామెడీతో అలరించాడు. మరీ ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాల్లో భరత్‌కు సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండేది. ప్రసుత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు.
తనీష్:
మన్మధుడు చిత్రంలో సునీల్‌తో కలిసి తనీష్ చేసిన కామెడీని ఎవరు మర్చిపోలేరు. అలానే దేవుళ్లు చ్రితంలో బాల అయ్యప్పగా అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో కూడా పార్టిసిపేట్ చేశాడు.
కావ్య:
లిటిల్ సోల్జర్స్ చిత్రంలో అంజలి పాత్రతో అందరిని ఆకట్టుకున్న ఆకట్టుకున్న లిటిల్ ఏంజెల్ పేరు కావ్య. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గతేడాది వివాహం చేసుకుంది.
అనుష్క:
డాడీ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె అక్షయ, ఐశ్వర్య పాత్రల ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యింది అనుష్క. ప్రస్తుతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాగ అన్వేష్:
బాగా చదవకపోతే ఏం అవుతుందో తెలుసా.. తలలో మల్లెపూలు పెట్టాలి.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలోని ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నాగ అన్వేష్. ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్‌తో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.
చక్రి తోలేటి:
విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం సినిమాలో ఓ బుడతడు భంగిమ.. గురించి కమల్‌హాసన్‌కు వివరించే సన్నివేశం గుర్తుందా. అతడి పేరు చక్రి తోలేటి. ప్రస్తుతం సినిమా రచయిత, దర్శకుడు, నటుడు, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో కొనసాగతున్నాడు.
బాలాదిత్య:
లిటిల్ సోల్జర్స్ చిత్రంలో గయ్యాళి చెల్లికి అన్నగా నటించాడు బాలాదిత్య. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కొనసాగతున్నాడు.
చేతన ఉత్తేజ్:
చిత్రం సినిమాలో కుక్క కావాలి అంటూ మారాం చేసే పిల్లాడు గుర్తున్నాడు.. ఆ చిచ్చర పిడుగు మరేవరో కాదు.. నటుడు ఉద్దేజ్ కుమార్తె చేతన. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 14 సినిమాల్లో నటించింది. పిచ్చిగా నచ్చావ్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
రాజ్ పోలవరపు:
నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన గోవిందా గోవిందా చిత్రం గుర్తుందా. ఆ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు మూగ పిల్లాడి పాత్ర కూడా కీలకం. అ బుడతడి పేరు రాజ్ పోలవరపు. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు.
కీర్తన:
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత చిత్రం గుర్తుందా. ఇందులో మాధవన్, సిమ్రన్‌లతో పోటీ పడి నటించిందిన అమృత అలియాస్ కీర్తన. ఈ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటిగా నలిచింది. ప్రస్తుతం దర్శకత్వ శాఖలో పని చేస్తుంది.
భశ్వంత్ వంశీ:
ఛత్రపతి చిత్రంలో సూరీడు పాత్రలో నటించిన చిన్నారి పేరు భశ్వంత్ వంశీ. సినిమాను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో అద్భుతమైన నటనతో అందరి మనుసులు గెలుచుకున్నాడు భశ్వంత్ వంశీ అలియాస్ సురీడు. ప్రస్తుతం గుర్తు పట్టలేని విధంగా మారాడు.
మాస్టర్ మహేంద్రన్:
తమిళనాడుకు చెందిన ఈ కుర్రాడు పలు తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. దేవి చిత్రంలో తన నటనతో అందరిని ఆకర్షించాడు. ప్రస్తుతం తమిళ్‌లో హీరోగా రాణిస్తున్నాడు.