బాల నటులుగా స్టార్ స్టేటస్ దక్కించుకుని.. పెద్దయ్యాక లీడ్ యాక్టర్స్‌గా వచ్చిన వారిలో ఇద్దరు మాత్రం భలే గుర్తుండి పోయారు. ఈ ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.
బాల నటులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, క్యూట్‌గా కనిపిస్తూ, ముద్దులొలికేలా డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకులను అలరించిన చైల్డ్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు అప్పటి బాల నటులే ఇప్పటి కథానాయకులు, కథానాయికలుగా మారిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో శ్రీదేవి, కమల్ హాసన్, తులసి మొదలుకుని.. నందమూరి కళ్యాణ్ రామ్, రాశి, తనీష్, మనోజ్ నందం.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. చిన్నతనంలో నటించి పెద్దయ్యాక వివిధ రంగాలలో సెటిల్ అయిన వారు కొందరైతే.. ట్రైనింగ్ తీసుకుని హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు మరికొంతమంది ఉన్నారు. కానీ బాల నటులుగా స్టార్ స్టేటస్ దక్కించుకుని.. పెద్దయ్యాక లీడ్ యాక్టర్స్‌గా వచ్చిన వారిలో ఇద్దరు మాత్రం భలే గుర్తుండి పోయారు.
ఈ ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్.. ‘మసూద’ తో ఫీమేల్ లీడ్‌గా పరిచయమై, రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘బలగం’ తో ప్రేక్షకులను అలరించిన కావ్య.. ఇప్పుడు మంచి ఆఫర్స్ దక్కించుకుంటూ జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటుంది. ఇక తేజ.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ తో ఎంట్రీ ఇచ్చి, ‘అద్భుతం’, ‘ఇష్క్’, ‘జాంబి రెడ్డి’ తో ఆకట్టుకుని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మతో చేస్తున్న సూపర్ హీరో ఫిలిం ‘హనుమాన్’ భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పిక్ విషయానికొస్తే.. తేజ, కావ్య ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘గంగోత్రి’.. అల్లు అర్జున్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తీసిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయింది. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ కథానాయికగా పరిచయమైంది. ఇందులో చిన్నప్పటి బన్నీగా తేజ, గంగోత్రిగా కావ్య కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా శత దినోత్సవ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పుడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తేజ – కావ్య షీల్డ్స్ తీసుకుంటున్నప్పటి అరుదైన ఫోటోనే ఇది.