సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ, గ్లామర్ తో, డాన్సులతో బిజీగా ఉంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత నటిగా మారింది. ఇప్పుడు స్టార్ అయిపోయింది. అనసూయకు పెళ్లై అప్పుడే దశాబ్దం దాటిపోయింది. ఇంత చరిత్ర చూస్తుంటే అసలు అనసూయకు ఎంత వయసు ఉంటుందనే అనుమానాలు చాలా మందిలో వస్తుంటాయి కూడా.
ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా గ్లామర్ షోలో మాత్రం అనసూయ అదుర్స్ అనిపిస్తుంది. ఈ జబర్దస్త్ యాంకర్‌ను చూస్తుంటే తనకు కుళ్లు వచ్చేస్తుందని సుమ కూడా చెప్పింది. అనసూయను చూస్తుంటే అసూయగా ఉంటుందని ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది సుమ కనకాల. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ రంగమ్మత్త ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుంటూ వెండితెర బుల్లితెర పై ఎంతో బిజీగా ఉన్న ఈ బ్యూటిఫుల్ యాంకర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుతున్న అనసూయ తన బ్యూటీ సీక్రెట్ ఏంటి అనే విషయాన్ని కూడా బయటపెట్టింది.
రోజురోజుకు వయసు పెరుగుతున్నప్పటికీ అనసూయ గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా రెట్టింపు అవడానికి గల కారణం ఏంటి కేవలం ఒక పూట మాత్రమే భోజనం తీసుకుంటానని ఒక పూట ఒక గ్లాస్ రెడ్ వైన్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానని తన బ్యూటీ సీక్రెట్స్ బయట పెట్టారు. రెడ్ వైన్ ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాకుండా పూర్తిగా ప్రయోజనాలను చేకూరుస్తుందని, గుండె ఆరోగ్యానికి, రెడ్ వైన్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అనసూయ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది..రెడ్ వైన్‌లో రెస్వెట్రాల్ ఉంటుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను దరికి చేరనివ్వదు. పూర్వకాలంలో ఈజిప్టియన్లు వైన్‌ను చాలా సమస్యలకు ఔషధంగా ఉపయోగించేవారు.
దాదాపు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరంలో వైన్‌ని తాగేవారని పరిశోధకులు చెబుతున్నారు. రెడ్ వైన్ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి ఎలాజిక్ ఆమ్లం కొవ్వు కణాల వృద్ధి రేటును తగ్గింది. టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. అయితే, అది ఎక్కువగా తీసుకోవడం కాదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని కొన్ని గుణాలు గుండె సమస్యలను దూరం చేస్తుంది. సో … ఇదీ కారణం మరి చాలామంది రెడ్ వైన్ తాగేయ్యడం మొదలుపెట్టేయకండి. అతి సర్వత్ర వర్జయేత్!..