యాంకర్ సుమ, భర్త రాజీవ్ కనకాలతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
మీకు తెలిసిన ఫేమస్ యాంకర్ పేరు చెప్పండి అంటే దాదాపు ప్రతి ఒక్కరూ సుమక్క అని అంటారు. ఇక్కడామే కాకపోయినప్పటికీ.. చాలా బాగా కలిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ ఓ మనిషైపోయింది. ఏ షో చూసినా, ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సుమ ఉండాల్సిందే! గతంతో పోలిస్తే ఇప్పుడు సుమ మేనియా కాస్త తగ్గిందనే చెప్పాలి. కొత్త యాంకర్స్ రావడం దీనికి కారణమై ఉండొచ్చు. అలాంటిది ఇప్పుడు సడన్ గా సుమ ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సుమ గుర్తుకురాగానే గలగలా మాట్లాడే యాంకర్ గుర్తొస్తుంది. స్వతహాగా మలయాళీ అయిన ఈమె.. నటుడు రాజీవ్ కనకాలని లవ్ మ్యారేజ్ చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ లో పలు సీరియల్స్, సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత యాంకరింగ్ మాత్రమే చేస్తూ బిజీ అయిపోయింది. ‘స్టార్ మహిళ’ షోతోపాటు దాదాపు అన్ని ఛానెల్స్ లోనూ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల ముందు రాజీవ్ తో విడిపోయిందని, వేరేగా మరో ఇంట్లో ఉందని రూమర్స్ వచ్చాయి. దీంతో చాలామంది షాకయ్యారు. విడాకులు గానీ తీసుకుందా అని తెగ డిస్కస్ చేశారు.
వీటిని సుమ, రాజీవ్ ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. నార్మల్ గా భార్యభర్తల మధ్య గొడవలే తామిద్దరికి వచ్చాయని, విడిపోయేంత ప్రాబ్లమ్స్ ఏం లేవని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా సుమ పోస్ట్ చేసే వీడియోల్లో రాజీవ్ పెద్దగా కనిపించేవాడు కాదు. దీంతో నెటిజన్స్ మళ్లీ సేమ్ విషయం గురించి మట్లాడుకున్నారు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి పూజలో కనిపించడంతో ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్లయింది. ఫ్యామిలీ బాగు కోసం ఈ పూజ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సుమ కొడుకు రోషన్.. హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. సో అదన్నమాట విషయం. మరి సుమ ప్రత్యేక పూజలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.