Sarkaru Vari Paata: తెలుగు చిత్ర సీమలో ‘‘పోకిరి’’ ఒక చెరిగిపోని రికార్డు. దర్శకుడిగా ‘‘పూరీ జగన్నాధ్’’.. హీరోగా మహేష్ బాబుల స్థాయిని పెంచేసిన సినిమా ఇది. ‘‘పోకిరి’’ సినిమాలో మహేష్‌కు అంతకు ముందు సినిమాల్లో మహేష్‌కు చాలా తేడా ఉంటుంది. మాస్ లుక్.. డిఫరెంట్ స్టైల్ ఆఫ్.. డైలాగ్ డెలివరీ.. కామెడీ టైమింగ్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ మూమెంట్స్‌తో మహేష్ యాక్టింగ్ ఇరగదీశారు. దాదాపు 12 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. ఏ లెవల్లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ‘‘పోకిరి’’ తర్వాత మహేష్ బాబుకు అంత పెద్ద మాస్ హిట్టు పడలేదు. హిట్లు వచ్చినా ‘‘పోకిరి’’ స్థాయిని రీచ్ కాలేకపోయాయి. నిజానికి కలెక్షన్ల పరంగా చాలా సినిమాలు పోకిరిని దాటాయి. కానీ.., మహేష్ ఫ్యాన్స్ కి మాత్రం పండుగాడు చాలా స్పెషల్. పోకిరి తరువాత పూరీ-మహేష్ బాబు కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. ఇద్దరూ కలిసి‘‘బిజినెస్‌మ్యాన్’’ సినిమా చేశారు. 2012లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా ‘‘పోకిరి’’ స్థాయిని అందుకోలేకపోయింది.
మహేష్ ఈ సినిమాలో ఓ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గానే కనిపించారు. ‘‘బిజినెస్ మ్యాన్’’ తర్వాత మహేష్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసినా.. మాస్ ప్రేక్షకులను ఆయన ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన ‘‘సర్కారు వారి పాట’’ సినిమాతో బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా, విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అందులో మహేష్ బాబు నటన ‘‘పోకిరి’’ సినిమా నటనని తలపించేదిలా ఉందన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు! సర్కారు వారి పాట ఇంకో పోకిరి కానుందని కూడా సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. అభిమానులు సైతం చాలా ఏళ్లనుంచి తమ హీరోకు ‘‘పోకిరి’’లాంటి మాస్ హిట్ ఇంకోటి పడాలని కోరుకుంటున్నారు. సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజైన తర్వాత వారిలో చెప్పలేనంత సంతోషం మొదలైంది. అన్ని రకాలుగా మాస్ ఫీల్ ఉన్న ట్రైలర్‌తో ఈ సినిమాను ‘‘పోకిరి 2’’ అనేయటం మొదలుపెట్టారు.
తమ హీరోకు మాస్ హిట్టు ఖాయం అన్న సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ సినిమాపై మహేష్ బాబు, మార్తాండ్ కే వెంకటేష్‌లు చేసిన వ్యాఖ్యలు అభిమానుల ఆలోచనకు ఊతం ఇస్తున్నాయి. ‘‘పోకిరి’’ సినిమాకు ఎడిటర్‌గా పని చేసిన మార్తాండ్ కే వెంకటేష్ ‘‘సర్కారి వారి పాట’’కూడా పనిచేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా పోకిరి 2 కాబోతోందని అన్నారు. తాజా ఇంటర్వ్యూలో మహేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘సర్కారు వారి పాట’’ పోకిరి సినిమాలా ఉంటుందని అన్నారు. మరి, మహేష్ బాబు, మర్తాండ్ కే వెంకటేష్, మహేష్ అభిమానులు అనుకుంటున్నట్లు ‘‘సర్కారు వారి పాట ’’ మరో ‘‘పోకిరి’’ కానుందా? ఈ మూవీ మహేష్ బాబును మరోసారి మాస్ హీరోగా నిలబెట్టగలదా?.. పోకిరి స్థాయిలో రికార్డులను తిరగరాసి, కలెక్షన్లను కొల్లగొట్టగలదా?.. అన్నది తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ‘‘ సర్కారు వారి పాట’’ సినిమాను మరో ‘‘పోకిరి’’ అంటూ వస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి
ఇవి కూడా చదవండి : Mahesh Babu: బాలీవుడ్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహేష్ బాబు